Dry Eye Syndrome: డేజంర్‌ బెల్స్ మోగిస్తున్న డ్రై ఐ సిండ్రోమ్.. యువతలో భారీగా పెరుగుతున్న కేసులు! ఎలా బయటపడాలంటే

ప్రస్తుతం యువతను భయపెడుతున్న మరో భయంకర వ్యాధి డ్రై ఐ సిండ్రోమ్.. ఇది సర్వత్రా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. డ్రై ఐ సిండ్రోమ్ ఒకప్పుడు పిల్లలకు వచ్చేది. ఇప్పుడు అన్ని వయసుల వారిని ఇబ్బంది పెడుతుంది. ఇది ఎందుకంత వేగంగా పెరుగుతుందో తెలుసా..

Dry Eye Syndrome: డేజంర్‌ బెల్స్ మోగిస్తున్న డ్రై ఐ సిండ్రోమ్.. యువతలో భారీగా పెరుగుతున్న కేసులు! ఎలా బయటపడాలంటే
Dry Eye Syndrome
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 23, 2024 | 7:59 PM

ఢిల్లీ, ఎన్‌సిఆర్‌తో సహా అనేక రాష్ట్రాల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. చలికాలం సమీపించేకొద్దీ, అనేక రాష్ట్రాలు దీపావళి పటాసులు కాల్చడం వల్ల కాలుష్యం పెరుగుతుంది. ఢిల్లీ AQI 300 స్థాయిని దాటింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణించవచ్చు. అటువంటి పరిస్థితిలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రజలు అనేక శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాల బారీన పడుతున్నారు. ఈ కాలుష్యం వల్ల వృద్ధులతో పాటు చిన్న పిల్లలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. కాలుష్యం కారణంగా డ్రై ఐ సిండ్రోమ్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ కాలుష్యం కారణంగా అధిక మంది ప్రజలు డ్రై ఐ సిండ్రోమ్‌కు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. డ్రై ఐ సిండ్రోమ్ ఒకప్పుడు పిల్లల్లో కనిపించేది. కానీ ఇప్పుడు ఇది యువత, వృద్ధులలో కూడా సంభవిస్తుంది. స్క్రీన్‌లను ఎక్కువగా ఉపయోగించడం, ఇండోర్ ఎయిర్ కండిషన్‌లో ఎక్కువ కాలం ఉండటం వంటి కారణాలు ఈ సమస్యకు కారణమవుతున్నాయి.

డ్రై ఐ సిండ్రోమ్ అంటే ఏమిటి?

కళ్లు పొడిబారడంతోపాటు కళ్లల్లో తగినంతగా కన్నీళ్లు పుట్టకపోవడాన్ని డ్రై ఐ సిండ్రోమ్‌ అని సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌ ఆప్తాల్మాలజీ విభాగం మాజీ హెచ్‌ఓడీ డాక్టర్‌ ఎకె గ్రోవర్‌ చెబుతున్నారు. దీని కారణంగా, కళ్ళు ఎర్రబడటం, కళ్ళు మండడం, కళ్ళు మసకబారడం వంటివి సంభవిస్తాయి. ఎక్కువగా స్క్రీన్‌లను చూడటం దీనికి కారణమని భావిస్తుంటారు. కానీ ఇప్పుడు నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, చెడు గాలి కూడా దీనికి కారణమవుతున్నాయి.

వేగంగా పెరుగుతున్న డ్రై ఐ సిండ్రోమ్ కేసులు

ఒక దశాబ్దం క్రితం వరకు ప్రతి నెలా కొద్ది మంది పిల్లలకు మాత్రమే డ్రై ఐ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారణ అయితే, 2019 నాటికి దాని సంఖ్య రెట్టింపు అయ్యింది. 2024 నాటికి దాని సంఖ్య వేగంగా పెరుగుతుంది. జనాలు ఫోన్‌లలో ఎక్కువ సమయం గడపడం కూడా దీని పెరుగుదలకు ప్రధాన కారణం. చిన్న పిల్లలు రెప్పవేయకుండా ఎక్కువసేపు మొబైల్ ఫోన్‌లను చూస్తుంటారు. దీనివల్ల ఈ వ్యాధి వచ్చే ప్రమాదం మరింత పెరిగింది. దీన్ని నియంత్రించకపోతే భవిష్యత్తులో ఈ వ్యాధి చాలా వేగంగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటి వరకూ ఎక్కువగా స్క్రీన్ చూడటం కారణంగా ఈ వ్యాధి బారిన పడుతుండగా, ప్రస్తుతం కాలుష్యం దాని ప్రమాదాన్ని మరింత పెంచింది. కాలుష్యం కారణంగా ప్రజల కళ్లు ఎర్రగా మారుతున్నాయి. కళ్లలో మంటతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటు ఎప్పుడూ ఎయిర్‌ కండిషన్‌తో మూసి ఉన్న గదుల్లో ఉండడం కూడా ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. ఎయిర్ కండిషన్డ్ రూమ్‌లో ఎక్కువసేపు ఉండడం వల్ల కళ్లు పొడిబారడంతోపాటు తేమ ఆరిపోతుంది. ప్రజలలో డ్రై ఐ సిండ్రోమ్ పెరగడానికి ఇవే ప్రధాన కారణాలు.

ఎలా బయటపడాలి..

  • డ్రై ఐ సిండ్రోమ్‌ను నివారించడానికి 20-20-20 నియమాన్ని అనుసరించాలి. స్క్రీన్‌పై పని చేస్తున్నప్పుడు ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉన్నదాన్ని చూడాలి. ఇది కళ్లకు ఉపశమనం కలిగిస్తుంది. రెప్పపాటును పెంచుతుంది. దీని వల్ల కళ్లలో తేమ ఉంటుంది.
  • ఇది కాకుండా, ఎల్లప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. శరీరంలో నీటి కొరత ఉండనివ్వకూడదు.
  • స్క్రీన్‌ని చూస్తున్నప్పుడు, ప్రతిసారీ విరామం తీసుకుంటూ ఉండాలి.
  • రాత్రి మంచి నిద్ర అవసరం. పడుకునే ముందు ఎక్కువసేపు మొబైల్ లేదా మరే ఇతర స్క్రీన్ వైపు చూడకూడదు.
  • అలాగే వైద్యుడిని సంప్రదించి చుక్కల మందు కూడా ఉపయోగించవచ్చు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.