Stone Fruits: 'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.! శరీరానికి ఎంతో మేలు

Stone Fruits: ‘స్టోన్ ఫ్రూట్స్’ అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.! శరీరానికి ఎంతో మేలు

Anil kumar poka

|

Updated on: Oct 23, 2024 | 8:45 PM

మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. కొందరు డైలీ ఫ్రూట్స్ తీసుకుంటుంటారు. అయితే.. పండ్లలోనూ "స్టోన్ ఫ్రూట్స్" తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు నిపుణులు. క్యాన్సర్లు, గుండె జబ్బులు, హై బీపీ, డయాబెటిస్‌ కాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడటంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయంటున్నారు. ఇంతకీ.. స్టోన్ ఫ్రూట్స్ అంటే ఏమిటి? ఎలాంటి పోషకాలుంటాయి? ఆ పండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి?

నార్మల్​గా చాలా ఫ్రూట్స్​లో గింజలు ఉండడం మనకు తెలిసిందే. అయితే.. కొన్నింటిలో పండ్లను కప్పి ఉంచే ఒక చిన్న రాయి లాంటి దృఢమైన నిర్మాణం ఉండి.. దాని చుట్టూ పండు గుజ్జు ఉంటుంది. ఇలాంటి పండ్లనే ‘స్టోన్ ఫ్రూట్స్’ అంటారు. చెర్రీస్, రాస్ప్‌బెర్రీ, మామిడి, ఆప్రికాట్స్‌, పీచ్‌, ప్లమ్స్.. వంటి కొన్ని పండ్లు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ పండ్లు అమోఘమైన రుచిని అందించడమే కాకుండా.. వీటిలో ఆరోగ్యాన్ని, అందాన్ని పెంపొందించే ఔషధ గుణాలూ సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

కాలం మారే కొద్దీ రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం కామన్! అయితే.. వాటి బారిన పడకుండా ఉండాలంటే బాడీలో తగినంత రోగనిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. అందుకు.. స్టోన్ ఫ్రూట్స్ చాలా బాగా సహాయపడతాయి. ఈ పండ్లలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఫ్రీరాడికల్స్‌ నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి.. శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

సాధారణంగా మనల్ని అప్పుడప్పుడు అలసట, నీరసం.. వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అయితే.. వాటి నుంచి ఉపశమనం పొంది నరాలు, కండరాలు రిలాక్స్‌ కావాలంటే స్టోన్స్‌ ఫ్రూట్స్‌ తీసుకోవడం చక్కటి మార్గమంటున్నారు వైద్యులు. ప్రధానంగా పీచ్‌, ప్లమ్‌.. వంటి ఫ్రూట్స్​లో పొటాషియం స్థాయులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల అలసట, నీరసం.. వంటివి దూరమవుతాయి. అంతేకాదు.. చెర్రీ పండ్లతో పాటు ఇతర స్టోన్ ఫ్రూట్స్ రక్తనాళాల్లో రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేసి బీపీని అదుపులో ఉంచుతాయి.

ఈ రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపుటలవాట్లే వివిధ రకాల క్యాన్సర్లకు కారణమవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే.. కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. ముందుగా జాగ్రత్తగా క్యాన్సర్ల బారిన పడకుండా ఉండాలంటే స్టోన్‌ ఫ్రూట్స్‌ని ఆహారంలో చేర్చుకోవడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలోని.. ఫైటోకెమికల్స్ కణాలు డ్యామేజ్‌ కాకుండా కాపాడతాయి. ఫలితంగా క్యాన్సర్‌ ముప్పును చాలా వరకు తప్పించుకోవచ్చంటున్నారు. అలాగే.. నేషనల్ ఇన్​స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ పరిశోధకుల బృందం చేపట్టిన ఓ పరిశోధనలోనూ స్టోన్ ఫ్రూట్స్​లో ఉండే ఫైటో కెమికల్స్ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయని కనుగొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.