AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sprouted Fenugreek: రోజూ మొలకెత్తిన మెంతులు తిన్నారంటే డయాబెటీస్‌ జీవితంలో రాదు

మధుమేహంతో బాధపడేవారికి మొలకెత్తిన మెంతి గింజలు ఎంతో మేలు చేస్తాయి. సహజ సిద్ధంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడమే కాకుండా బీపీ, కొలెస్ట్రాల్ వంటి పలు సమస్యలు దాడి చేయకుండా నిరోధించవచ్చు..

Srilakshmi C
|

Updated on: Oct 23, 2024 | 8:16 PM

Share
మొలకెత్తిన మెంతి గింజల్లో అనేక విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విటమిన్ సితో పాటు విటమిన్ ఎ, బి కూడా ఇందులో ఉంటాయి. అంతేకాకుండా, మొలకెత్తిన మెంతులు ప్రోటీన్, కాల్షియం, ఫైబర్‌తోపాటు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.

1 / 5
వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో ఉండే పీచు పొట్టను మృదువుగా ఉంచుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

2 / 5
మెంతి గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గిస్తాయి. మొలకెత్తిన మెంతులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. ఇవి బిపి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

3 / 5
మొలకెత్తిన మెంతుల్లో తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ సి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇందులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్ ప్రభావాలు స్త్రీపురుషుల హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. మెనోపాజ్, పిఎంఎస్‌తో బాధపడుతున్న మహిళలకు మొలకెత్తిన మెంతి గింజలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

4 / 5
మొలకెత్తిన మెంతులు, కాల్షియం సమృద్ధిగా, దంతాలు, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మెంతులు మొలకెత్తాలంటే ముందుగా మెంతి గింజలను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీటిని తొలగించి నానిన మెంతులను ఒక గుడ్డలో చుట్టాలి. అనంతరం 2 నుండి 3 రోజులు అలాగే వదిలేయాలి. అప్పుడు మెంతి మొలకలు వచ్చేస్తాయి.

5 / 5