AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఆయిల్‌ ట్యాంకర్‌లో గుట్టుగా యవ్వారం.. అనుమానంతో పోలీసుల తనిఖీ! తర్వాత ఏం జరిగిందంటే

రోడ్డుపై వెళ్తున్న HP ఆయిల్ ట్యాంకర్ ను పోలీసులు ఆపి, క్యాజువల్ తనిఖీలు చేపట్టారు. అయితే పోలీసులను చూడగానే అందులోని డ్రైవర్, మరో వ్యక్తి భయంతో వెనక్కి చూడకుండా పరుగు లంకించుకున్నారు. అసలింతకీ లోపత ఏం ఉందా అని తనిఖీ చేయగా..

Watch Video: ఆయిల్‌ ట్యాంకర్‌లో గుట్టుగా యవ్వారం.. అనుమానంతో పోలీసుల తనిఖీ! తర్వాత ఏం జరిగిందంటే
Liquor Seized From HP Oil Tanker
Srilakshmi C
|

Updated on: Oct 23, 2024 | 5:56 PM

Share

పాట్నా, అక్టోబర్‌ 23: ప్రముఖ కంపెనీ పేరుతో ఉన్న ఆయిల్‌ ట్యాంకర్‌లో అక్రమంగా మద్యం రవాణా చేస్తూ ఎక్సైజ్ శాఖకు పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో సదరు ఆయిల్‌ ట్యాంకర్‌ను వెంబడించి, రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇక పోలీసులను చూసిన డ్రైవర్‌, అందులోని వ్యాపారి వాహనాన్ని రోడ్డుపైనే వదిలి పరారయ్యారు. ఈ షాకింగ్‌ ఘటన బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ HP ఆయిల్ ట్యాంకర్‌లో మద్యం రవాణా చేస్తున్నట్లు బీహార్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు సమాచారం అందింది. స్మగ్లర్లను పట్టుకునేందుకు ఓ టీంను ఏర్పాటు చేసి రహదారిపై మాటు వేశారు. అదే రూటులో వచ్చిన నాగాలాండ్‌లో రిజిస్టర్ చేయబడిన హెచ్‌పీ ఆయిల్‌ ట్యాంకర్‌ పోలీసులను చూసి, నేషనల్ హైవే వైపు దారి మళ్లించారు. గమనించిన పోలీసులు ఆ ట్యాంకర్‌ను వెంబడించారు. కొంత దూరం వెళ్లాక పోలీసులు ట్యాంకర్‌ను చేజ్‌ చేసి ఆపగలిగారు. వెంటనే అందులోని డ్రైవర్, మద్యం వ్యాపారి ట్యాంకర్‌ను వదిలి పారిపోయారు. ట్యాంకర్‌ నుంచి సుమారు 200 మద్యం డబ్బాలను ట్యాంకర్‌ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ విజయ్ శేఖర్ దూబే తెలిపారు. ఆయిల్ ట్యాంకర్ నుంచి మద్యం కార్టన్లను బయటకు తీస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

పట్టుబడిన మద్యం సీసాలు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందినవిగా గుర్తించారు. స్మగ్లింగ్ ఆపరేషన్‌లో భాగంగా ట్యాంకర్‌ నుంచి పరారైన స్థానిక వ్యాపారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. అతడిని అరెస్టు చేసేందుకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా బీహార్‌ రాష్ట్రంలో మద్యంపై నిషేధం అమలులో ఉంది. అయినప్పటికీ మద్యం రవాణా, అమ్మకాలు అక్రమంగా కొనసాగుతున్నాయి. మద్యం నిషేధం కారణంగా డిమాండ్‌ అధికంగా ఉండటంతో.. ఇదే అదనుగా స్మగ్లర్లు రాష్ట్ర సరిహద్దుల గుండా మద్యాన్ని రవాణా చేయడానికి కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. గతంలో అంబులెన్స్‌లు, ట్రక్కులు, పెట్రోల్ ట్యాంక్‌లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంపార్ట్‌మెంట్లలో మద్యం అక్రమంగా తరలిస్తూ పలువురు పట్టుబడ్డారు. రాష్ట్రంలో మద్యం నిషేధంపై కఠినమైన నిబంధనలు ఉన్నప్పటికీ, స్మగ్లర్లు మాత్రం వినూత్న పద్ధతుల్లో మద్యం తరలిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.