AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏంది సామీ చంపేస్తారా? చల్లగా బీరు తాగుదామని ఓపెన్ చేయబోతే.. మైండ్‌ బ్లాంక్‌ సీన్‌! వీడియో

ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుందామని స్థానికంగా ఉన్న ఓ వైన్ షాపులో మద్యం బాటిల్లు కొని ఇంటికి తెచ్చాడో వ్యక్తి. ఆనక పార్టీ స్టార్ట్ చేద్దామని ఓ బీరు బాటిల్ మూత తీయబోయాడు. అంతే బాటిల్ లోపల కనిపించిన సీన్ చూసి పరేషాన్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Viral Video: ఏంది సామీ చంపేస్తారా? చల్లగా బీరు తాగుదామని ఓపెన్ చేయబోతే.. మైండ్‌ బ్లాంక్‌ సీన్‌! వీడియో
Lizard In Beer Bottle
Srilakshmi C
|

Updated on: Oct 25, 2024 | 6:10 PM

Share

వికారాబాద్‌, అక్టోబర్ 25: పార్టీ చేసుకుందామని స్థానిక దుకాణంలో పెద్ద ఎత్తున బీర్లు కొనుగోలు చేశాడో వ్యక్తి. ఆనక వాటిని తీసుకొచ్చి.. ఓపెన్‌ చేయబోగా బీరు సీసాలో కనిపించిన దృశ్యం చూసి గుడ్లు తేలేశాడు. బీరు సీసాలో ఓ సరీసృపం తేలుతూ కనిపించింది. దీంతో పరాషానైన సదరు వ్యక్తి బాటిల్‌ను ఓపెన్‌ చేయకుండానే నేరుగా షాప్‌కు తీసుకెళ్లాడు. ఇదేంటని ప్రశ్నించగా.. తమకేం తెలియదని దబాయించడంతో చిర్రెత్తిపోయిన సదరు వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ షాకింగ్‌ ఘటన తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం కేరెల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, అనంతయ్య ఇద్దరూ స్నేహితులు. వీరు పార్టీ చేసుకోవడానికని రూ.4వేల విలువైన మద్యం సీసాలను స్థానికంగా ఉన్న ఓ వైన్‌ షాపు నుంచి కొనుగోలు చేశారు. బీర్లతో పాటు వివిధ బ్రాండ్లకు చెందిన మందును ఇంటికి తీసుకెళ్లారు. తీరా పార్టీ చేసుకుందామని బీరు బాటిల్‌ ఓపెన్‌ చేయబోతే అందులో ఏదో తేలుతూ కనిపించింది. ఇదేంటా అని క్షుణ్నంగా పరిశీలించి చూడగా.. మైండ్‌ బ్లాంక్‌ అయ్యే సీన్‌ కనిపించింది. బడ్‌వైజర్‌ బ్రాండ్‌కు చెందిన బీరు బాటిలో లోపన చనిపోయిన బల్లి తేలుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాకైన స్నేహితులు ఇద్దరూ బాలిల్‌ ఓపెన్‌ చేయకుండానే.. దానిని కొనుగోలు చేసిన షాపుకు తీసుకెళ్లారు.

ఇవి కూడా చదవండి

వైన్‌ షాపు నిర్వాహకుడికి బీరు బాటిల్‌ లోపల బల్లి ఉందని చూపిస్తే.. సదరు వైన్‌ షాపు యజమాని మాత్రం తమకేం సంబంధం లేదని దబాయించాడు. దానిని తయారు చేసిన కంపెనీ నుంచే అలా వచ్చి ఉంటుందని, మేం మధ్యలో ఉండి దానిని మీకు విక్రయించామని, దానికి మేమేం చేస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో కోపోద్రిక్తుడైన లక్ష్మీకాంత్‌ రెడ్డి.. బీర్‌ బాటిల్‌ లోపల తేలుతున్న బల్లి అవశేషాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. నాణ్యతలేని మద్యం విక్రయించి, మా ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారా? అంటూ పలువురు మందుబాబులు మండిపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో