AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG CPGET 2024 Counselling: తెలంగాణ సీపీగెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ వచ్చేసింది.. రిజిస్ట్రేషన్లు ఎప్పటినుంచంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ యూనివర్సిటీల్లోని పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగెట్ 2024 తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి..

TG CPGET 2024 Counselling: తెలంగాణ సీపీగెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్ వచ్చేసింది.. రిజిస్ట్రేషన్లు ఎప్పటినుంచంటే
TG CPGET 2024 Counselling
Srilakshmi C
|

Updated on: Oct 27, 2024 | 2:34 PM

Share

హైదరాబాద్‌, అక్టోబర్‌ 27: తెలంగాణ సీపీగెట్‌ 2024 తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ రేపట్నుంచి (అక్టోబర్‌ 28) ప్రారంభం కానుంది. ఈ మేకు ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. తుది విడత కౌన్సెలింగ్‌ రిజిస్ట్రేషన్ నవంబర్‌ 1వ తేదీ వరకు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అలాగే ధ్రువపత్రాల పరిశీలన కూడా నవంబర్‌ 1వ తేదీనే ఉంటుంది. నవంబర్‌ 1వ తేదీ నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నవంబర్‌ 4వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఇక తుది విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ నవంబర్‌ 8న ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు నవంబర్‌ 12వ తేదీలోపు ఆయా కాలేజీల్లో స్వయంగా వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలతోపాటు జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ ర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తాయనే సంగతి తెలిసిందే.

తెలంగాణ సీపీగెట్‌ 2024 తుది విడత కౌన్సెలింగ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

నవంబర్ 1 నుంచి ఎంఈడీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభం..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్‌ ట్రైనింగ్‌ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ జారీ అయ్యింది. అక్టోబర్ 28వ తేదీ నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్ 1వ తేదీతో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల గడువు పూర్తవుతుంది. నవంబర్ 1 నుంచి 4వ తేదీలోపు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ 4వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. నవంబర్ 8వ తేదీ సీట్లు కేటాయింపు ఉంటుంది. ఇక ఈ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 12వ తేదీలోగా సీట్లు పొందిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కొత్తగా ఎంపికైన 870 టీచర్‌లకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఉత్తర్వులు.. కారణం ఇదే

తెలంగాణ రాష్ట్రంలో అవసరం లేని చోట ఉన్న టీచర్‌ పోస్టులను తొలగించి అవసరమున్న చోటకు మార్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి శనివారం (అక్టోబరు 26) ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల రాష్ట్రంలో పలు పాఠశాలలను ఉన్నతీకరించిన సంగతి తెలిసిందే. అంటే ప్రాథమిక నుంచి ప్రాథమికోన్నత, ప్రాథమికోన్నత నుంచి ఉన్నత పాఠశాలలుగా విద్యాశాఖ రూపకల్పన చేసింది. అలాంటి చోట్ల విద్యార్థులు ఎక్కువగా ఉన్నప్పటికీ టీచర్లను కేటాయించాలంటే పోస్టులు లేవు. అలాంటి స్కూళ్లను దృష్టిలో ఉంచుకొని ఇటీవల డీఎస్సీ 2024లో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు కేటాయించారు. ఈ నేపథ్యంలో డీఈవోలు సమర్పించిన జాబితా మేరకు మొత్తం 870 ఉపాధ్యాయులను పాఠశాలలకు మారుస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో