Gym Trainer: ‘దృశ్యం’ సీన్‌ దించేశాడు.. 4 నెలల క్రితం కిడ్నాపైన మహిళ డెడ్‌ బాడీ VVIP ఏరియాలో లభ్యం!

దృశ్యం సినిమా మీకు గుర్తుందా? అందులో హీరో ఫ్యామిలీ అనుకోకుండా ఓ వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ లో పాతి పెడతారు. ఆ తర్వాత తాము హత్య చేయలేదని రకరకాల ప్రూఫ్ లను సృష్టిస్తారు. సరిగ్గా అలాంటి ఘటనే కన్పూర్ లో చోటు చేసుకుంది. సరిగ్గా 4 నెలల క్రితం కనబడకుండా పోయిన మహిళ మృతదేహం తాజాగా VVIP ప్రాంతంలో లభ్యం కావడం కలకలం రేపింది..

Gym Trainer: 'దృశ్యం' సీన్‌ దించేశాడు.. 4 నెలల క్రితం కిడ్నాపైన మహిళ డెడ్‌ బాడీ VVIP ఏరియాలో లభ్యం!
Gym Trainer Murdered A Woman
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 27, 2024 | 5:33 PM

లక్నో, అక్టోబర్‌ 27: నెలల క్రితం అదృశ్యమైన మహిళ మృతదేహం అనూహ్య రీతిలో బయటపడింది. జిల్లా కలెక్టర్‌తో సహా ఇతర ప్రభుత్వ అధికారుల నివాసాలు ఉండే వీవీఐపీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఆ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్‌పూర్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వ్యాపారవేత్త భార్య ఏక్తా గుప్తా జూన్ 24వ తేదీన అదృశ్యమైంది. దీనిపై పోలీస్‌ స్టేషన్‌ మిస్సింగ్‌ కేసు కూడా నమోదైంది. పోలీసులు ఆమె ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దర్యాప్తులో వారికి పలు కీలక ఆధారాల దొరికాయి. కాన్పూర్‌లోని రాయ్‌పూర్వా ప్రాంతానికి చెందిన జిమ్‌ ట్రైనర్‌ విమల్ సోనీ వద్దకు ఆమె చివరిగా వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. అనూహ్యంగా మహిళ అదృశ్యమైన తర్వాత జిమ్‌ ట్రైన్‌ విమల్‌ కూడా కనిపించకుండా పోయాడు. అతడి కోసం పూణే, ఆగ్రా, పంజాబ్‌లలో పోలీసులు టీంలుగా ఏర్పడి గాలిస్తున్నారు. విమల్‌ మొబైల్‌ ఫోన్‌ వాడకపోవడంతో అతడి ఆచూకీ గుర్తించడం కాస్త ఆలస్యమైంది. ఎట్టకేలకు విమల్‌ను అరెస్ట్‌ చేయడంతో.. ఏక్తాగుప్తాను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. తనకు పెళ్లి సంబంధం కుదరడంతో ఆమె సంతృప్తి చెందినట్లు తెలిపాడు.

సోనీ, ఏక్తా ప్రేమలో ఉన్నారని, అయితే అతనికి ఇటీవల మరొక యువతితో నిశ్చితార్థంకావడంతో ఆమె అభ్యంతరం చెప్పింది. అ క్రమంలో జూన్‌ 24న ఏక్తా జిమ్‌కు వచ్చింది. అక్కడి సోనీ , ఏక్తా మధ్య వాగ్వాధం జరిగింది. అనంతరం వీరిద్దరూ జిమ్‌ నుంచి బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అనంతరం కారులో వెళ్లినట్లు నిందితుడు చెప్పాడు. వాగ్వాదం సందర్భంగా మహిళ మెడపై తాను కొట్టడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. దీంతో సోనీ ఆమెను హత్య చేసినట్లు వెల్లడించాడు. అనంతరం మహిళ మృతదేహాన్ని జిల్లా కలెక్టర్‌ బంగ్లా, ఇతర ప్రభుత్వ అధికారుల నివాసాలు ఉన్న వీవీఐపీ ప్రాంతంలో పాతిపెట్టినట్లు చెప్పాడు. బాలీవుడ్ మువీ ‘దృశ్యం’ చూసిన తర్వాత కాన్పూర్ DM నివాసం సమీపంలో మహిళను పాతిపెట్టాలనే ఆలోచన తనకి వచ్చిందని తెలిపాడు.

ఇవి కూడా చదవండి

నిందితుడు చెప్పిన ప్రాంతంలో పోలీసులు తవ్వగా మహిళ మృతదేహం బయటపడింది. నిందితుడు విమల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు జిమ్ ట్రైనర్‌తో తన భార్య రిలేషన్‌షిప్‌లో ఉందన్న వాదనను మహిళ భర్త రాహుల్ గుప్తా ఖండించారు. ఈ విషయంపై గుప్తా మాట్లాడుతూ.. ఇది వివాహేతర సంబంధం కాదు. ఇది కిడ్నాప్ కేసు. కిడ్నాప్ చేసినట్లు మేము కేసు పెట్టాం. నాలుగు నెలల్లో రెండుసార్లు మీడియా ద్వారా ఈ సమాచారం పంచుకున్నామని’ గుప్తా చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.