AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: జాగ్రత్తగా ఉండండి.. ‘డిజిటల్ అరెస్ట్’పై దేశాన్ని హెచ్చరించిన ప్రధాని మోదీ

సైబర్ మోసాలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. ఏ రకంగా అవకాశం ఉంటే.. ఆ రకంగా జనం జేబులు ఖాళీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ క్రమంలోనే 'డిజిటల్ అరెస్ట్' మోసంపై దేశప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

PM Modi: జాగ్రత్తగా ఉండండి.. 'డిజిటల్ అరెస్ట్'పై దేశాన్ని హెచ్చరించిన ప్రధాని మోదీ
Pm Modi Mann Ki Baat
Balaraju Goud
| Edited By: |

Updated on: Oct 27, 2024 | 9:58 PM

Share

‘డిజిటల్ అరెస్ట్’ మోసంపై దేశప్రజలను ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఫోన్‌లో బెదిరించి ఏ ప్రభుత్వ సంస్థ డబ్బు అడగదన్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వ్యక్తులు పోలీసులు, సీబీఐ, ఆర్‌బీఐ లేదా నార్కోటిక్స్ అధికారులుగా నటిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. తప్పుడు మోసాలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలి పెట్టేదీ లేదని ప్రధాని తెలిపారు.

ఆదివారం(అక్టోబర్ 27) ‘మన్ కీ బాత్’ 115వ ఎపిసోడ్‌లో ‘డిజిటల్ అరెస్ట్’ మోసం ఎలా జరుగుతుందో ప్రధాని మోదీ సవివరంగా వివరించారు. దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. మీపై కేసులు నమోదయ్యాయి. సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేయడానికి వస్తున్నారంటూ బెదిరిస్తున్నారు. మీపై ఉన్న కేసులు మాఫీ కావాలంటే డబ్బులు ఇవ్వాలంటూ .. బ్యాంకు స్టేట్మెంట్స్, ఓటీపీలు రాబట్టి… అకౌంట్‌లో ఉన్న డబ్బును కొట్టేస్తున్నారు. ఇందులో మొదటి దశ మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం. రెండవ దశ భయం వాతావరణాన్ని సృష్టించడం, మూడవది సమయం పేరుతో ఒత్తిడి. దీంతో ప్రజలు చాలా భయపడతారు. వారు ఆలోచించి, అర్థం చేసుకునే శక్తిని కోల్పోతారు. వయో వర్గాల వారు ఈ రకమైన మోసానికి గురవుతున్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారు కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకున్నారు.

ఎవరికైనా ఇలాంటి కాల్ వస్తే భయపడవద్దని ప్రధాని మోదీ దేశప్రజలను కోరారు. ఇటువంటి సందర్భాలలో డిజిటల్ భద్రతకు మూడు దశలు ఉన్నాయని గుర్తు చేశారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ చాలా వరకు ఆపివేయండి, ఆలోచించండి. వీలైతే, స్క్రీన్‌షాట్‌లు తీసుకోండి, కాల్స్ రికార్డింగ్ చేయండి. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్ ద్వారా బెదిరింపులు చేయదు, డబ్బు డిమాండ్ చేయదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు నేషనల్ సైబర్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేయాలని ప్రజలను కోరిన ప్రధాని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇలాంటి కేసులను నమోదు చేసి పోలీసులకు, సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలకు తెలియజేయాలని తెలిపారు. జాబ్స్‌, లోన్స్‌, కొరియర్‌ పేరిట వచ్చే ఫ్రాడ్‌కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు.

మరిన్ని జ.ాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..