Slow Poison: ఆస్తి కోసం ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం.. భర్తకు ఆహారంలో స్లో పాయిజన్‌ ఇచ్చి హత్య!

ఆస్తి కోసం ఓ భార్య.. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. భర్తకు తెలియకుండ ఆహారంలో రోజూ స్లో పాయిజన్ ఇచ్చి పక్కా ప్లాన్ తో హత మార్చింది. అనంతరం ఏమీ ఎరగనట్లు డ్రామాలు ఆడింది. అయితే చెల్లెలు నంగనాచి ఏడుపు నమ్మని ఆమె అన్నయ్య కూపీ లాగగా అసలు విషయం బయటపడింది..

Slow Poison: ఆస్తి కోసం ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం.. భర్తకు ఆహారంలో స్లో పాయిజన్‌ ఇచ్చి హత్య!
Woman Kills Husband
Follow us
Srilakshmi C

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 27, 2024 | 9:58 PM

ఉడుపి, అక్టోబర్ 27: ప్రియుడి మోజులో పడి ఓ భార్య కట్టుకున్న భార్తను కడతేర్చింది. అదీ కూడా పక్కా ప్లాన్‌తో చేసింది. రోజూ భోజనంలో స్లోపాయిజన్‌ కలిపి ఇచ్చేది. రోజురోజుకీ ఇలా శరీరం మొత్తం విషమయం అవడంతో ఆ భర్త కన్నుమూశాడు. ఇలా భర్తను అడ్డు తొలగిస్తే.. అతడి ఆస్తిని కాజేసి, ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని సదరు భార్య ప్లాన్‌ వేసింది. కానీ చివరకు పోలీసులకు చిక్కడంతో మొత్తం కథ అడ్డం తిరిగింది. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..

కర్కాల హిర్గానాకు చెందిన ప్రతిమ (36), బాలకృష్ణ(44) దంపతులు. ప్రతిమ స్థానికంగా బ్యూటీ పార్లర్‌ నడిపేది. అయితే ఆమెకు దిలీప్ హెగ్డే (28) అనే మరో యువకుడితో ఇటీవల పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ కలిసి బాలకృష్ణ అడ్డు తొలగిస్తే అతడి ఆస్తి మొత్తం వీరి చేతికి వస్తుందని అనుకున్నారు. అంతే.. అతడిని చంపేందుకు ప్లాన్‌ వేశారు. ప్లాన్ ప్రకారం.. ప్రతిమ భర్త బాలకృష్ణకు రోజూ ఆహారంలో పారామౌర్ అనే స్లో పాయిజన్‌ కలిపి ఇచ్చేంది. దీంతో అతడి ఆరోగ్యం రోజురోజుకీ సన్నగిల్ల సాగింది. ఈ క్రమంలో బాలకృష్ణ గత 25 రోజులుగా జ్వరం, వాంతులతో బాధపడసాగాడు. తీవ్ర అనారోగ్యానికి గురైన అతడిని కర్కాలలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ వైద్యులు అతను జాండిస్‌తో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతరం మణిపాల్, మంగళూరు, బెంగళూరులోని ఆసుపత్రులకు తరలించారు. బాలకృష్ణ కోలుకునే సూచనలు కనిపించకపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఆయుర్వేద చికిత్స ప్రారంభించేందుకు అక్టోబరు 19 రాత్రి అజేకర్‌లోని ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజే హత్యకు గురైనట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అక్టోబరు 20న ప్రతిమ, దిలీప్‌లు ఆహారంలో బాలకృష్ణకు విషపదార్థాలు కలిపి ఇచ్చారు. అనంతరం అతడి గొంతు నులిమి హత్య చేశారు. తన భర్త హఠాన్మరణం చెందాడని ప్రతిమ అందరినీ నమ్మించింది. అనంతరం అక్కడికి చేరుకున్న ప్రతిమ అన్నయ్య, ఇతర బంధువులు బాలకృష్ణ ముఖం, మెడపై గాయాలు ఉండటం గమనించారు. ఆ గాయాలు వాటర్‌ బాటిల్ల వల్ల తగిలాయని చెప్పింది. కానీ సందీప్‌ మాత్రం అనుమానంతో ఆరా తీయగా మొత్తం ప్లాన్ బయటపడింది.

సందీప్ మాత్రం ఆమె చెప్పే కథను నమ్మలేదు. ప్రతిమకు రీల్స్ చేసి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసే అలవాటు ఉంది. ఆ రీల్స్‌లో తరచూ ఆమెతో దిలీప్‌ కనిపించేవాడు. బాలకృష్ణ మృతిపై అనుమానంతో ప్రతిమ అన్నయ్య సందీప్ అసలేం జరిగిందని గట్టిగా అడగటంతో అసలు విషయం చెప్పింది.. అక్టోబర్ 20వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటలకు తన భర్తను దిలీప్‌తో కలిసి హత్య చేశామని.. అంతకు ముందు దిలీప్ సూచనల మేరకు ప్రతిమ తన భర్తను నెమ్మదిగా చంపేస్తుందని ఆహారంలో స్లో పాయిజన్‌ కలిపి భర్తకు ఇచ్చిందని ప్రతిమ వెల్లడించింది. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో దిలీప్‌కు ఫోన్ చేసి, అతడిని పిలిపించి బాలకృష్ణ గొంతు నులిమి చంపేసినట్లు తెలిపింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బంధువులకు ఫోన్‌ చేసి, తన భర్త మరణించాడని చెప్పి అందరినీ నమ్మించినట్లు తెలిపింది. ప్రతిమ నేరం అంగీకరించడంతో అదంతా రికార్డు చేసి, పోలీసులకు అందించాడు సందీప్‌. తన చెల్లెలె ప్రతిమతోపాటు ఆమె ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. దిలీప్ మొబైల్ ఫోన్, స్కూటర్, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దిలీప్‌ విషాన్ని కొనుగోలు చేసిన దుకాణం నుండి అదనపు సమాచారాన్ని సేకరించారు. మరణానికి గల కారణాలను నిర్ధారించేందుకు బాలకృష్ణ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.