Watch Video: యువకుడికి కార్డియాక్‌ అరెస్ట్.. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ కుప్పకూలి మృతి! వీడియో వైరల్

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.. ఏ క్షణాన ఎటు నుంచి మృత్యువు దూసుకు వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అప్పటి వరకూ నవ్వుతూ మాట్లాడుతున్న ఓ యువకుడు ఉన్నట్లుండి ముందుకు ఒరిగి క్షణాల్లో మరణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది..

Watch Video: యువకుడికి కార్డియాక్‌ అరెస్ట్.. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ కుప్పకూలి మృతి! వీడియో వైరల్
Sudden Cardiac Arrest
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 28, 2024 | 9:23 AM

రేవా, అక్టోబర్‌ 28: అప్పటి వరకూ ఫ్రెండ్స్‌తో జోకులు వేస్తూ.. నవ్వుతూ సరదాగా మాట్లాడిన యువకుడు స్నేహితుల ముందే కుప్పకూలి మరణించాడు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు అంతా జరిగిపోయింది. ఈ షాకింగ్‌ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన ఐదుగురు స్నేహితులు సిర్మౌర్ కూడలిలో ఉన్న ఒక దుకాణంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండటం వీడియోలో కనిపిస్తుంది. అందరూ జోకులు వేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రకాష్ సింగ్ బఘెల్ (31) అనే వ్యక్తి ఉన్నట్లుండి కుర్చీలో నుంచి ముందుకు ఒరిగిపోవడం వీడియోలో కనిపిస్తుంది. సరదాగా పడిపోయాడని భావించారేమో.. చుట్టూ ఉన్న స్నేహితులు మాత్రం కొన్ని సెకన్లపాటు షాకింగ్‌గా చూస్తూ ఉండిపోతారు. ఆ తర్వాత తేరుకుని కంగారుగా ప్రకాశ్‌ను లేపి కుర్చీలో కూర్చేబెట్టే ప్రత్నం చేస్తారు. అయినా అతడు ముందుకు పడిపోవడం వీడియోలో కనిపిస్తుంది. దీంతో తీవ్ర భయాందోళనలకు గురైన అతడి స్నేహితులు ప్రకాశ్‌ ముఖంపై నీళ్లు చల్లి, లేపేందుకు ప్రయత్నిస్తారు. కానీ అతనిలో ఎలాంటి స్పందన కనబడదు. దీంతో అతడి స్నేహితులు నేలపై వెల్లకిలా పడుకోబెట్టి, ఛాతీపై చేతులు వేసి సీపీఆర్‌ చేసేందుకు ప్రయత్నిస్తారు. అలా ఒకరి తర్వాత ఒకరు సీపీఆర్‌ చేస్తారు. అయినా ఫలితం కనిపించకపోవడంతో.. హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ఆసుపత్రిలోని వైద్యులు అతన్ని పరిశీలించి మృతి చెందినట్లు ధృవీకరించారు. ప్రకాశ్‌ సడెన్‌ కార్డియాక్ అరెస్ట్ వల్ల మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై ప్రకాష్ సోదరుడు మాట్లాడుతూ.. అతనికి గతంలో ఎటువంటి గుండె సంబంధిత వ్యాధులు లేవని, చాలా యాక్టివ్‌గా పనులు చేస్తాడని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటానని వైద్యులకు తెలిపాడు. ఈ ఘటన అక్టోబర్ 20న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే