Sreeleela: సరదా.! రోడ్డు పక్క టీస్టాల్ లో సందడి చేసిన స్టార్ హీరోయిన్.!
ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో శ్రీలీల కూడా ఒకరు. కేవలం అందం, అభినయం పరంగానే కాకుండా డ్యాన్సులతో దుమ్మురేపుతోందీ అందాల తార. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ఒక అరడజనుకు పైగా సినిమాలున్నాయి. పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ రాబిన్ హుడ్, రవితేజ, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోందీ ముద్దుగుమ్మ. ఒక బాలీవుడ్ సినిమాలోనూ శ్రీలీల నటిస్తోందని ప్రచారం జరుగుతోంది.
స్టార్ హీరోయిన్ అయినా ఒక సాధారణ అమ్మాయిలా రోడ్ సైడ్ టీ స్టాల్ లో టీ తాగింది. అంతేకాదు ఆ టీ షాప్ నిర్వహిస్తోన్న మహిళ, చుట్టు పక్కల ఉన్నవారితో అప్యాయంగా మాట్లాడింది. వారితో సరదగా ఫొటోలు కూడా దిగింది. తాజాగా ఓ సినిమా షూటింగ్ కోసం అరకు వెళ్లింది శ్రీలీల. అయితే షూటింగ్ లో కాస్త విరామం దొరకడంతో మధ్యలో తన తల్లితో కలిసి రోడ్ సైడ్ ఉన్న ఒక చిన్న టీ స్టాల్ కు వెళ్లి సందడి చేసింది. శ్రీలీలను గమనించిన స్థానికులు భారీగా అక్కడికి చేరుకున్నారు. హీరోయిన్ తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. శ్రీలీల కూడా అడిగిన వారందరికీ కాదనకుండా సెల్ఫీలు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

