Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: హోటల్‌ గది కిటికీలో నుంచి జారి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి.. దైవ దర్శనానికి వస్తే కడుపుకోత

దైవ దర్శనానికి వచ్చిన ఆ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. హోటల్ గదిలో ఆటలాడుకుంటున్న నాలుగేళ్ల బాలిక ప్రమాదవశాత్తు హోటల్ గది కిటికీలో నుంచి జారిపడి మరణించింది. ఈ విషాద ఘటన విజయవాడలో చోటు చేసుకుంది..

Vijayawada: హోటల్‌ గది కిటికీలో నుంచి జారి పడి నాలుగేళ్ల చిన్నారి మృతి.. దైవ దర్శనానికి వస్తే కడుపుకోత
Mini Mineral Grand Hotel
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 29, 2024 | 10:38 AM

గుణదల, అక్టోబర్‌ 29: తీర్థయాత్రలకు వచ్చిన ఓ కుటుంబంలో అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఓ హోటల్‌లో బస చేసేందుకు దిగిన ఆ కుటుంబం గంటల వ్యవధిలోనే పెను విషాదంలో చిక్కుకుంది. వచ్చీరాని మాటలతో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అప్పటి వరకూ సందడి చేసిన తమ చిన్నారి కళ్లముందే ప్రాణాలు వదిలింది. ఈ హృదయ విషాదకర ఘటన విజయవాడలోని మినర్వా గ్రాండ్‌ హోటల్‌లో చోటు చేసుకుంది. మాచవరం సీఐ ప్రకాష్‌ తెలిపిన వివరాల మేరకు..

విశాఖపట్నం మహారాణిపేటకు చెందిన బద్రి నాగరాజు అనే ఫార్మసిస్టుకు భార్య సాయి గీత, కుమారుడు జై అద్విక్‌ (6), కుమార్తె రూహిక (4) ఉన్నారు. వీరంతా అక్టోబర్‌ 26న తీర్థయాత్రలకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో శ్రీశైలం, మహానంది దర్శనం చేసుకుని ఆదివారం విజయవాడకు బయల్దేరారు. అదే రోజు రాత్రి విజయవాడకు చేరుకున్న ఈ నాగరాజు కుటుంబం సోమవారం కనకదుర్గమ్మను దర్శించుకున్నాక ఇంటికి వెళ్దామని అనుకుకున్నారు. దీంతో వారంతా మినర్వా గ్రాండ్‌ హోటల్‌ నాలుగో అంతస్తులో గది తీసుకుని, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. సోమవారం ఉదయం నిద్రలేచిన భార్య సాయిగీత స్నానానికి వెళ్లింది. నాగరాజు పడుకున్నారు. ఇంతలో పిల్లలు ఇద్దరూ దాగుడు మూతల ఆట ఆడుకుంటున్నారు.

ఈ క్రమంలో కుమార్తె రూహిక కిటికీ వద్ద కర్టెన్‌ వెనుక దాక్కొంది. అయితే ఆ కిటికీకి ఇనుప గ్రిల్‌ లేదు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ చిన్నారి అందుతప్పి అందులో నుంచి కిందకు జారిపోయింది. ఈ క్రమంలో కిటికీ రెక్క పట్టుకుని 20 సెకన్ల పాటు గాలిలో వేలాడూ కాపాడాలని చిన్నారి కేకలు వేసింది. కింద రోడ్డు మీదుగా వెళ్తున్న ఇద్దరు యువకులు గమనించి పెద్దగా కేకలు వేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించారు కూడా. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది. చిన్నారి కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయమవడంతో రోడ్డంతా రక్తసిక్తమైంది. ఇంత జరుగుతున్నా గదిలోని తల్లిదండ్రులకు తెలియకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

కాసేపటి తర్వాత చెల్లి కనిపించడంలేదని అద్విక్‌ తండ్రికి చెప్పడంతో.. వారు గది అంతా వెతుకుతూ కిటికీలోంచి కిందకు చూడగా.. కనిపించిన దృశ్యం వారిని నిలువెళ్ల కలచివేసింది. పరుగు పరుగున కిందకు చేరుకున్న నాగరాజు, సాయిగీత.. తీవ్రగాయాల పాలైన కుమార్తెను పక్కనే ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లమని అక్కడి వైద్యులు సూచించారు. అక్కడకు తీసుకెళ్లగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీర్థయాత్రలకు బయల్దేరినా కారులోనే కుమార్తె మృతదేహాన్ని తీసుకుని కొండంత దుఃఖంతో సొంతూరుకు బయల్దేరారు. మరోవైపు కిటికీకి గ్రిల్స్‌ అమర్చకుండా గది అద్దెకు ఇచ్చిన హోటల్‌ యాజమన్యం నిర్లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ ఎండగడుతున్నారు. వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమండ్‌ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.