Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సుష్మ థియేటర్ దగ్గర తత్తర బిత్తరగా కనిపించిన యువకుడు.. ఏంటని ఆరా తీయగా దిమ్మతిరిగే ట్విస్ట్..

సుష్మా థియేటర్ దగ్గర డ్రగ్స్ అమ్ముతున్న నెల్లూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 7 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ లభించాయి. చదువుతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడి, డబ్బుల కోసం అమ్మకాలకు దిగాడని పోలీసులు తెలిపారు. ఇలాంటి మరికొందరు ఉన్నారని అనుమానిస్తున్నారు.

Hyderabad: సుష్మ థియేటర్ దగ్గర తత్తర బిత్తరగా కనిపించిన యువకుడు.. ఏంటని ఆరా తీయగా దిమ్మతిరిగే ట్విస్ట్..
Hyderabad Crime News
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 29, 2024 | 9:56 AM

అతనొక బీటెక్ విద్యార్థి.. సాఫ్ట్‌వేర్ స్కిల్స్ నేర్చుకోవడానికి హైదరాబాద్ నగరానికి వచ్చాడు.. ఇక్కడ జేఎన్టీయూలో జాయిన్ అయ్యాడు. చదువుతోపాటు డ్రగ్స్, గంజాయ్‌కి అలవాటు పడ్డాడు. అంతే వాటిని కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడంతో ఏకంగా డ్రగ్స్ అమ్మకాలకే దిగాడు.. ఈ డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్న సమయంలో పోలీసులకు చిక్కాడు. దీంతో బిటెక్ విద్యార్థిని అరెస్టు చేసిన ఎక్సైజ్ ఎస్టిఎఫ్ పోలీసులు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనే అంశాలపై విచారిస్తున్నారు.. ఈ మధ్యకాలంలో మాదకద్రవ్యాలను అమ్ముతూ పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా యువతే ఉంటున్నారు.. మొదటగా యువతను టార్గెట్ చేసినటువంటి సప్లయర్లు వారికి డ్రగ్స్, గంజాయ్ అలవాటుగా మార్చుతున్నారు. ఆ తర్వాత ఇవి అలవాటుగా మారిన తర్వాత కన్జ్యూమర్లుగా ఉన్నటువంటి యూత్ ను సప్లయర్లుగా మార్చుకుంటున్నారు.. ఈ మధ్య పట్టుబడిన కేసులు అన్నిట్లోనూ సప్లయర్లుగా ఇంజనీరింగ్, ఇతర ఉన్నత చదువులు చదివినటువంటి విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారు. వారంతా గతంలో గంజాయికి, డ్రగ్స్ కి బానిసలుగా ఉన్నటువంటి వారే.. తాజాగా వనస్థలిపురం ఎస్విఆర్ గార్డెన్ క్రాంతి హిల్స్ కాలనీ సుష్మా థియేటర్ సమీపంలో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారంతో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ఏ టీం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానస్పదంగా కనిపిస్తున్న ఓ విద్యార్థిని పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు తనిఖీలు నిర్వహించగా అతని వద్ద ఏడు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ లభించాయి. డ్రగ్స్ తో పాటు అతని వద్ద ఉన్నటువంటి బైక్, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు..

Crime News

నెల్లూరుకి చెందిన కట్టమంచి జాన్ ఒక గ్రాము 2500 ఎండిఎంఏ ను తీసుకువచ్చి 5000 రూపాయలకు అమ్మకాలు జరుపుతున్నాడని పోలీసులు తెలిపారు. అయితే, అసలు అతనికి ఈ ఎండిఎంఏ డ్రగ్ ఎక్కడి నుంచి వచ్చింది.. అనే దారి మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. జాన్ నెల్లూరులో బీటెక్ చేశాడు సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోవడానికి హైదరాబాదుకు వచ్చి జేఎన్టీయూలో చేరాడు.. చదువుతోపాటు డ్రగ్స్‌కి బానిసై వాటి కొనుగోలుకు డబ్బులు లేకపోవడంతో ఈ విధంగా డ్రగ్స్ అమ్మకాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడం కలకలం రేపింది.. అయితే, జాన్ తరహాలోనే మరికొందరు ఉన్నారని పేర్కొంటున్నారు పోలీసులు..

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..