Janwada Farmhouse Case: జన్వాడ పార్టీ కేసులో మరో ట్విస్ట్.. ఆ ఫోన్ ఆయనది కాదు.. ఆమెదంట..!

జన్వాడ పార్టీ కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ మద్దూరి పోలీసులకు వేరే మహిళ ఫోనును అందించడం కలకలం రేపుతోంది. హైకోర్టు రాజ్ పాకాలకు 48 గంటల గడువు ఇచ్చింది. ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Janwada Farmhouse Case: జన్వాడ పార్టీ కేసులో మరో ట్విస్ట్.. ఆ ఫోన్ ఆయనది కాదు.. ఆమెదంట..!
Janwada Farm House Case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 29, 2024 | 12:17 PM

జన్వాడ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.. ఇప్పటికే.. పోలీసులు కేసు నమోదు చేసి.. కీలక ఆధారాలు రాబట్టేందుకు విచారణ వేగవంతం చేశారు. అయితే.. జన్వాడ పార్టీ కేసులో సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. పక్కా ఆధారాలు, స్టేట్‌మెంట్స్‌ ఉన్నాయని కోర్టును విన్నవించారు అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌. దాని ఆధారంగానే ముందుకెళ్తామన్నారు. అయితే ఇది రాజకీయ వేధింపులని.. ఇంట్లో జరుగుతున్న పార్టీపై రెయిడ్స్‌ నిర్వహించి.. కక్షసాధిస్తున్నారంటూ రాజ్‌ పాకాల లాయర్‌ వాదించారు. అటు పోలీసులు నమోదు చేసిన FIRపై అనుమానాలున్నాయని.. తగినంత సమయం ఇవ్వకుండానే విచారణకు పిలుస్తున్నారంటూ కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు రాజ్‌ పాకాలకు 48 గంటల సమయం ఇచ్చింది. నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని పోలీసులను ఆదేశించింది. రాజ్‌ పాకాలకు హైకోర్టు 48 గంటల సమయం ఇవ్వగా.. ఆధారాల మేరకు చర్యలుంటాయని AAG కోర్టుకు తెలిపింది..

ఇదిలాఉంటే.. జన్వాడ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. జన్వాడ నైట్‌ పార్టీ కేసులో ఆ రాత్రి ఏం జరిగిందనే విషయంలో విచారణ చేపట్టనున్నారు. అయితే రెయిడ్స్‌ జరిగిన రోజు విజయ్‌ మద్దూరి తన ఫోన్‌ కాకుండా.. పార్టీకి వచ్చిన వేరే మహిళ ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోన్‌ తనకు ఇవ్వాలని మోకిల పోలీసులను కోరుతున్నారు. దీంతో ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు పోలీసులు. కాగా.. నిన్నటి నుంచి విజయ్‌ మద్దూరి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ లో ఉంది.. దీనిపై కూడా పోలీసులు విచారణ చేపట్టనున్నారు.

వీడియో చూడండి..

అయితే.. జన్వాడ పార్టీ కేసులో నిన్న విచారణకు గైర్హాజరైన విజయ్‌ మద్దూరి, రాజ్‌ పాకాల.. 48 గంటల గడవు తర్వాత పోలీసులకు ఏం సమాధానం చెబుతారనేది కీలకంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే