ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ పెను ప్రమాదకరంగా మారుతోంది.. ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల, మీరు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు మీ కొలెస్ట్రాల్ స్థాయిని సకాలంలో నియంత్రించకపోతే.. మీరు గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. మారిన జీవనశైలి, చెడు ఆహారం కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారని.. దీంతోపాటు అధిక ఒత్తిడి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడానికి కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.