Gold Prices: మూడేళ్ల క్రితం ఇలా చేసుంటే.. మీ ఇల్లు బంగారం అయ్యేది.. దీపావళి వేళ గోల్డ్ కొనవచ్చా..

బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దీపావళి సందర్భంగా బంగారం కొనుగోలు పెరుగుతున్నప్పటికీ.. అధిక ధరలు చాలామందికి సవాల్‌గా మారాయి. రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల కారణంగా ధరలు పెరుగుతున్నాయి. నిపుణులు బంగారం పెట్టుబడిగా మంచిదని, నగలు లేదా ETFల రూపంలో కొనవచ్చని సూచిస్తున్నారు.

Gold Prices: మూడేళ్ల క్రితం ఇలా చేసుంటే.. మీ ఇల్లు బంగారం అయ్యేది.. దీపావళి వేళ గోల్డ్ కొనవచ్చా..
Gold Prices In India.
Follow us

|

Updated on: Oct 28, 2024 | 1:58 PM

బంగారం ధర కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఏడాదిలో.. బంగారం ఆల్ టైమ్ హైకి 35 సార్లు చేరుకుంది. ఈ ఏడాది బంగారం ధర 33 శాతం పెరిగింది. రానున్న కాలంలో బంగారం ధర లక్ష రూపాయల మార్కును దాటే అవకాశం లేకపోలేదు. మరో ఏడాదికల్లా వెండి కూడా లక్షా 25వేలకు చేరొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. దీపావళి పండగ సీజన్‌ మొదలైంది. సాధారణంగా, దీపావళి సమయంలో బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఇప్పుడు బంగారం ధర సరికొత్త గరిష్టానికి చేరడంతో మధ్యతరగతి ప్రజలకు బంగారం కొనడం సవాల్‌గా మారింది. 10 గ్రాముల బంగారం కొనాలంటే 80 వేల రూపాయలకు పైగా కావాలి. ఈ టైమ్‌లో బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు.

ప్రస్తుతం ఎక్కడ చూసిన దీపావళి పండుగ సందడి కొనసాగుతోంది. దీపావళిని ఐదురోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ధన త్రయోదశి రోజున- ఎంతోకొంత బంగారం లేదా వెండి కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తే కలిసి వస్తుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే ధన త్రయోదశిరోజున గురివింద గింజ ప్రమాణమైనా సరే, పసిడిని తప్పకుండా కొనుగొలు చేస్తారు.

అయితే కొన్ని రోజులుగా రేట్లు పైకి ఎగబాకుతూ పసిడి కొనాలా, వద్దా? అనే ఆలోచనలో పడేస్తున్నాయి. ఇప్పుడు దీపావళి ఎఫెక్ట్‌తో బంగారం ధర మరింత పెరిగే అవకాశముంది. అయితే బంగారం ధర ఇంతగా ఎందుకు పెరుగుతోందనేది ప్రశ్న..?

భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం బంగారం ధరల పెరుగుదలకు కారణం. అతి తక్కువ కాలంలోనే బంగారం ధర వేగంగా పెరుగుతుంది. ప్రస్తుతం మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం కొనసాగుతుండగా, మరోవైపు రష్యా-ఉక్రెయిన్ వివాదం ఇంకా సమసిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇది బంగారం ధరపై ప్రభావం చూపుతుంది. దీనికి తోడు గత ఐదేళ్లలో రూపాయి విలువ క్షీణించింది. మూడున్నరేళ్లలో బంగారం ధర 40 నుంచి 70వేల పెరిగింది. అంటే 75 శాతం ఎక్కువైంది.

ప్రస్తుతం భారత్ లో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ.79,800, 22 క్యారెట్ల ధర రూ.73,150గా ఉంది.. అయితే, బంగారం ధర ఎలాగూ పెరిగే అవకాశం ఉన్నందున, మనం చేయాలి? బంగారం కొనాలా.. వద్దా..? అన్నదే అసలు పాయింట్‌. నిపుణులు మాత్రం గోల్డ్‌ షాపింగ్ చేయాలని సూచిస్తున్నారు. పెట్టుబడి కోసం పసిడిని ఇప్పుడు కొనుగోలు చేసినాసరే, మున్ముందు మంచిధర వస్తుందని అంచనాలు వేస్తున్నారు. బంగారాన్ని నగల రూపంలో కొన్నా లేదా, ETFలను కొనుగోలు చేసినా మంచిదే అంటున్నారు. సో.. మీ దగ్గర ఏమాత్రం డబ్బు ఉన్నా, చేయండి గోల్డ్‌ షాపింగ్‌.. కొనేయండి బంగారం.. అంటున్నారు మార్కెట్ నిపుణులు..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
బాబు, బాలయ్య మధ్య జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన. చంద్రబాబు ఏమన్నారు?
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
నీళ్లు ఎక్కువ తాగుతున్నారా.? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడాల్సిందే!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
వామ్మో.. ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
మీ శరీరంలో బీ12 లోపిస్తే.. కనిపించేవి ఈ లక్షణాలే.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
చిమ్మ చీకటిలో చెట్టుపై నుంచి పడి.. 15 గంటలు నరకయాతన.!
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
వీళ్ల ఆయుష్షు గట్టిదే.. లేకపోతేనా.? దాడి చేసిన చిరుత..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
ఒక్క స్పూన్ వాముతో ఎన్నో అద్భుతాలు.! గౌట్ సమస్యకు..
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
వన్‌ప్లస్‌ యూజర్లకు గుడ్ న్యూస్‌.! ఫ్రీగా డిస్‌ప్లే మార్చుకోవచ్చు
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
ప్రపంచ కుబేరులు.. రాత్రి వేళల్లో రోడ్లపైకొస్తారా.? వీడియో వైరల్.
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!
వాటి రాక కోసం.. దీపావళికి టపాసులు కాల్చని గ్రామస్థులు.!