- Telugu News Photo Gallery Business photos Ratan Tata Will Pet Dog tito Shantanu Naidu to have shares know more details here
Ratan Tata: పెంపుడు కుక్కతో పాటు పని మనుషులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్ టాటా!
Ratan Tata: ఇటీవల మరణించిన వ్యాపారవేత్త రతన్ టాటా తన పెంపుడు కుక్క టిటో సంరక్షణ కోసం ప్రత్యేక ఆస్తిని రాశారు. అంతేకాదు, తనతో చాలా కాలం పనిచేసిన రాజన్ షా, వంట మనిషి సుబ్బయ్య, అసిస్టెంట్ శంతను నాయుడు ఆస్తులను కూడా రతన్ టాటా రాసిచ్చాడు. మరి రతన్ టాటాకు ఉన్న ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
Updated on: Oct 28, 2024 | 2:36 PM

భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అక్టర్ 9వ తేదీన కన్నుమూశారు. ఆయన మరణం అందరికీ తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రపంచవ్యాప్తంగా రతన్ టాటా గ్రూప్ వృద్ధికి రతన్ టాటా కీలకపాత్ర పోషించారు. అలాగే ఎందరో వ్యాపారవేత్తలకు, యువతకు ఆయన గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆయన కాలంలోనే టాటా గ్రూప్ షేర్లు విపరీతంగా పెరిగాయని చెప్పవచ్చు. ఆయన మృతితో రతన్ టాటా ట్రస్ట్ తదుపరి చైర్మన్ ఎవరు అనే ప్రశ్న తలెత్తింది.

రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా ఇటీవలే టాటా ట్రస్ట్ కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. అదే సమయంలో రతన్ టాటాకు రూ.10,000 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అంచనా. ఈ ఆస్తులను ఎవరికి రాసిస్తాడన్న ప్రశ్న తలెత్తింది. రతన్ టాటాపై రాసిన జీవిత చరిత్ర ఇప్పుడు ప్రచురితమైంది.

దీని ప్రకారం రూ.10,000 కోట్లకు పైగా విలువైన తన ఆస్తుల్లో కొంత భాగాన్ని తన ట్రస్టుకు కేటాయించారు. అలాగే, సోదరుడు జిమ్మీ టాటా తన సవతి సోదరీమణులు షిరిన్, దినా జీజ్‌బాయ్‌లకు కొన్ని ఆస్తులను ఇచ్చారు. అలాగే ఇంట్లో పనిచేసే ఉద్యోగులు, బంధువులకు వీలునామా రాసి ఇచ్చాడు. ముఖ్యంగా రతన్ టాటా వద్ద ఉండే ఓ కుక్కకు కూడా ఆస్తి రాసిచ్చాడంటే రతన్ టాటా ఎలాంటి వ్యక్తే అర్థం చేసుకోవచ్చు. జర్మన్ షెపర్డ్ కుక్క 'టిటో' కోసం ఆస్తిని రిజర్వ్ చేశారు.

టిటో (కుక్క)నిర్వహణ ఖర్చుల కోసం రతన్ టాటా విడిగా ఆస్తులను రాశారు. రతన్ టాటా జీవించిన రోజుల్లో టిటో టాటాతోనే ఉంది. అతని అంత్యక్రియలకు కుక్క కూడా హాజరైంది. ఒక ఆస్తికి పెంపుడు జంతువు పేరు పెట్టడం భారతదేశంలో ఇదే మొదటిసారి. కానీ విదేశాల్లో పెంపుడు జంతువులకు వీలునామా రాసి కాలం వెళ్లదీస్తున్నారు.

అలాగే వంట మనిషిగా పనిచేసిన రాజన్ షా, దాదాపు 30 ఏళ్లపాటు అతని వద్ద బట్లర్‌గా పనిచేసిన సుబ్బయ్యలకు ఆస్తులు కేటాయించారు. రతన్ టాటా తన ఇంటి సిబ్బందితో చాలా ఎంతో బంధం ఉంది. విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు వారికి తరచూ డిజైనర్ దుస్తులను తెచ్చి ఇచ్చేవారు. రతన్ టాటా తన ఇంట్లోని ఉద్యోగులందరి భవిష్యత్తు కోసం ఆస్తి రాసిచ్చాడు.




















