Sardar Vallabhbhai Patel: ఆ విషయంలో పటేల్‌నే ఫాలో అవుతాం.. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ప్రధాని మోదీ నివాళి
పటేల్ బాటలోనే ఎన్డీఏ సర్కార్.. ఒకే దేశం - ఒకే పాలసీ విధానంతో ముందుకెళ్తున్నట్టు ప్రధాని మోదీ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర పుష్పాంజలి ఘటించారు.
భారత తొలి ఉపప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ప్రధాని నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ దగ్గర పుష్పాంజలి ఘటించారు. అనంతరం, సర్దార్ సేవలను గుర్తుచేసుకుంటూ జాతి సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేశారు. ఒకే దేశం – ఒకే లక్ష్యంతో ముందుకెళ్లినప్పుడే.. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి నిజమైన నివాళి అర్పించినట్టు ప్రధాని మోదీ అన్నారు. పటేల్ బాటలోనే ఎన్డీఏ సర్కార్.. ఒకే దేశం – ఒకే పాలసీ విధానంతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. వన్ నేషన్-వన్ సివిల్ కోడ్-వన్ ట్యాక్స్-వన్ రేషన్.. మాదిరిగానే దేశం బలోపేతం కోసం వన్ నేషన్-వన్ ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు.