Gold: భారతీయులు 3 నెలల్లో ఎంత బంగారం కొన్నారో తెలుసా? పసిడికి పెరిగిన డిమాండ్‌!

Gold: దీపావళి రోజున వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నుంచి కీలక అప్‌డేట్‌ వచ్చింది. బుధవారం నాడు మూడో త్రైమాసికం 2024 బంగారం డిమాండ్ ట్రెండ్ రిపోర్టును అందజేస్తూ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యుజిసి) ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లపై రిపోర్టును విడుదల చేసింది..

Gold: భారతీయులు 3 నెలల్లో ఎంత బంగారం కొన్నారో తెలుసా? పసిడికి పెరిగిన డిమాండ్‌!
Follow us

|

Updated on: Oct 31, 2024 | 12:01 PM

భారత్‌లో బంగారానికి రోజురోజుకూ డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. పసిడి దిగుమతులపై ట్యాక్సుల కోతతోనే డిమాండ్‌ పెరిగినట్లు చెబుతున్నారు బులియన్‌ నిపుణులు. జూలై- సెప్టెంబరు మధ్య దేశంలో 18 శాతం పసిడికి డిమాండ్‌ పెరిగినట్లు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సమయంలో 210 టన్నులుగా ఉన్న డిమాండ్‌ ఈ ఏడాది 248 టన్నులకు పెరిగింది.

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో మున్ముందు బంగారానికి డిమాండ్‌ మరింత పెరిగే చాన్స్‌ కనిపిస్తోంది. ఈ ఏడాది మొత్తంగా 700 నుంచి 750 టన్నుల పసిడి డిమాండ్‌ ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. బంగారం దిగుమతులపై కేంద్రం సుంకాలు తగ్గించడమే పసిడి పరుగులకు కారణమని చెబుతున్నారు.

బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉండగా.. తొలిస్థానంలో చైనా కొనసాగుతోంది. మన దేశం స్విట్జర్లాండ్‌ నుంచి 40 శాతం, యూఏఈ నుంచి 18 శాతం, సౌతాఫ్రికా నుంచి 10శాతం పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌- నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో బంగారం దిగుమతులు ఏకంగా 21శాతం పెరిగాయి.

సెప్టెంబరు నాటికి భారత్‌ దగ్గర 855 టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ నివేదికలు చెబుతున్నాయి. ఈ మొత్తంలో 510 టన్నుల బంగారాన్ని దేశీయంగా నిల్వ చేయగా.. మిగతా బంగారాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ దగ్గర దాచిపెట్టింది. దేశంలో బంగారానికి రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్‌తోపాటు అంతర్జాతీయంగా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో 102 టన్నుల బంగారం వెనక్కు తెచ్చింది. దేశంలోనే నిల్వ చేయడం మంచిదనే నిర్ణయంతోనే దశలవారీగా బంగారాన్ని వెనక్కు తీసుకువస్తోంది రిజర్వ్‌ బ్యాంకు.

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..