Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి ఇది బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. దీపావళి పండుగ సమయంలో కూడా భారీగా ధరలు పెరుగుతున్నాయ్. గత మూడు రోజుల ధరలు పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1400కుపైగా పెరిగింది. ఆ వివరాలు..

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి ఇది బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 01, 2024 | 8:05 AM

దీపావళి పండుగకు గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్ ఇస్తున్నాయ్ బంగారం ధరలు. 22 క్యారెట్ల తులం బంగారం ధర మళ్లీ రూ. 75 వేల మార్క్‌కు చేరువ కాగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 82 వేలకు చేరువయ్యింది. ఇదిలా ఉండగా.. గత మూడు రోజుల్లో చూస్తే 22 క్యారెట్ల బంగారంపై రూ. 1400, 24 క్యారెట్ల బంగారంపై రూ. 1530 మేరకు పెరిగింది. ఇక మళ్లీ శుక్రవారం కూడా మరోసారి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయ్. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది చదవండి: బాబోయ్.! 5 స్టాప్‌లు, 11 గంటలు.. ఈ వందేభారత్ రైలు రూటే సపరేటు

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,710గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 81,490 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 74,560కాగా,24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 81,340గా ఉంది.

* చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 74,560కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 81,340గా ఉంది.

* కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340 వద్ద కొనసాగుతోంది.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.

* విజయవాడలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.

* విశాఖపట్నం విషయానికొస్తే ఇక్కడ కూడా ఈ రోజు హైదరాబాద్‌, విజయవాడలో నమోదైన ధరలు మాదిరిగానే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 74,560కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 81,340గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

వెండి కాస్త భిన్నంగా రియాక్ట్ అవుతోంది. బంగారం పెరుగుతూపోతుంటే.. వెండి స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ. 100వరకు పెరిగింది. ఢిల్లీతో పాటు, ముంబయి, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 99,900గా ఉండగా హైదరాబాద్‌, చెన్నై, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 1,08,900కి చేరుకుంది. కాగా, ఈ బంగారం ధరలు ఈరోజు ఉదయం ఆరు గంటలకు నమోదైనవిగా గమనించగలరు. బంగారం కోనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు చెక్‌ చేసుకోవడం బెటర్‌. ఇక లేటెస్ట్‌ బంగారం ధరలను తెలుసుకోవడానికి, మీరు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..