జియో దీపావళి రీఛార్జ్‌.. నవంబర్‌ 3లోపు రీఛార్జి చేసుకున్నవారికి ₹3,350 బెనిఫిట్స్‌

జియో దీపావళి రీఛార్జ్‌.. నవంబర్‌ 3లోపు రీఛార్జి చేసుకున్నవారికి ₹3,350 బెనిఫిట్స్‌

Phani CH

|

Updated on: Oct 31, 2024 | 10:28 PM

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ‘దీపావళి ధమాకా’ ఆఫర్లను తీసుకొచ్చింది. పండగ సందర్భంగా తీసుకొచ్చిన ఈ సదుపాయంతో ఎంపిక చేసిన రీఛార్జీలపై రూ.3,350 విలువైన ప్రయోజనాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. నవంబర్‌ 3లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్స్‌ పొందుతారు.

దీపావళి ఆఫర్‌లో భాగంగా రూ.899, రూ.3,599 రీఛార్జి ప్లాన్లపై అదనపు ప్రయోజనాలను జియో అందిస్తోంది. ఆఫర్‌ ముగిసేలోగా ఈ ప్లాన్‌లతో రీఛార్జి చేసుకుంటే రూ.3,000 విలువ చేసే ఈజ్‌ మై ట్రిప్‌ వోచర్‌ అందిస్తోంది. విమాన ప్రయాణాలు, హోటల్‌ బుకింగ్స్‌ చేసుకొనే వారు ఈ వోచర్‌ వినియోగించుకోవచ్చు. రూ.999 కంటే ఎక్కువ మొత్తంతో అజియో వేదికగా కొనుగోలు చేసినప్పుడు రూ. 200 విలువైన అజియో కూపన్‌ వర్తిస్తుంది. రూ.150 విలువైన స్విగ్గీ వోచర్‌ కూడా ఈ ప్లాన్లతో ఇస్తోంది. ‘మై జియో’ యాప్‌ సాయంతో కూపన్లు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. జియో అందిస్తున్న రూ.899 త్రైమాసిక ప్లాన్‌ 90 రోజల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌ రీఛార్జితో రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పొందొచ్చు. జియో మరో ప్లాన్‌ రూ.3,599 ప్లాన్‌తో అపరిమిత కాలింగ్‌ లభిస్తాయి. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 2.5జీబీ డేటాను పొందొచ్చు. ఈ ప్యాక్‌ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పరువు పోతుందనే సైలెంట్‌గా ఉంటున్నారా ?? కంప్లైంట్‌ అందుకే ఇవ్వడం లేదా ??

బూచోళ్లు తిరుగుతున్నారు !! తల్లిదండ్రులారా జాగ్రత్త

Amaran: శివ కార్తికేయన్‌ ‘అమరన్’ సినిమా.. హిట్టా ?? ఫట్టా ??

గోవా రైల్లో బుస్‌.. బుస్‌..సెకెండ్‌ ఏసీలో కర్టెన్‌ తీసి చూస్తే షాక్‌..

లక్కీ భాస్కర్.. హిట్టా ?? ఫట్టా ?? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి