AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

When to buy Gold: బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా..

When to buy Gold: బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా..

Anil kumar poka
|

Updated on: Oct 31, 2024 | 9:23 AM

Share

బంగారం అంటే బంగారమే. పసిడికున్న మెరుపూ తగ్గదు. రేటులో దాని జోరూ తగ్గదు. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ రేటు పెరుగుతూనే ఉంది. ధనత్రయోదశి, దీపావళితోపాటు అంతా పండుగలు, పెళ్లిళ్ల సీజన్. దీనికితోడు.. ప్రపంచంలో వివిధ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం. అటుపక్క అమెరికా ఎలక్షన్లు. ఇంకేముంది.. రన్ రాజా రన్ అంటూ అందకుండా రన్ చేస్తోంది.

ధన త్రయోదశి అమ్మకాలు భారీగా ఉంటాయని బంగారం షాపుల వర్తకులు చాలా ఆశపడ్డారు. కానీ అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో అది కాస్తా పండుగ కొనుగోళ్లపై ప్రభావం చూపించింది. అందుకే గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి సేల్స్ దాదాపు 10 శాతం తక్కువగానే ఉన్నాయన్నారు. గత ఏడాది.. అంటే 2023లో ధనత్రయోదశి.. నవంబర్ 11న పడింది. అప్పుడు 999 స్వచ్ఛత ఉన్న 10 గ్రాముల బంగారం ధర 61 వేల 200 రూపాయిలు ఉంది. కిలో వెండి ధర 74 వేల రూపాయిలుగా ఉంది. ఇక ఈ ఏడాది ధన త్రయోదశి.. అక్టోబర్ 29న పడింది. ఆరోజున 10 గ్రాముల బంగారం ధర 81 వేల 400 రూపాయిలు ఉంది. కిలో వెండి ధర దాదాపు లక్ష రూపాయిలు ఉంది. ధనత్రయోదశి సందర్భంగా అమ్మకాలు తగ్గినా.. దాని విలువను చూస్తే మాత్రం మంచి బిజినెస్ జరిగినట్లే అంటున్నారు వర్తకులు. ఎందుకంటే విలువ పరంగా 20 శాతం లేదా అంతకన్నా ఎక్కువ శాతమే పెరిగే ఛాన్సుంది అంటున్నారు వ్యాపారులు. అయితే ఈసారి వినియోగదారులు తమ దగ్గరున్న పాత ఆభరణాలను ఎక్స్ ఛేంజ్ చేసుకోవడానికే ఇంట్రస్ట్ చూపించినట్లు తెలుస్తోంది. పాతవి ఇచ్చి కొత్తవి కొనుగోలు చేశారు. సాధారణంగా.. ధనత్రయోదశికి ముందే చాలామంది ఆర్డర్లు ఇచ్చేస్తారు. కానీ ఈ పండగ రోజే తమకు డెలివరీ ఇవ్వాలని షాపుల వాళ్లను కోరుతారు....