Gold Price: బంగారం బరువాయెనా ?? రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు

Gold Price: బంగారం బరువాయెనా ?? రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు

Phani CH

|

Updated on: Nov 01, 2024 | 11:03 AM

బంగారం ఇప్పుడు ఎంత లెవల్‌కు పోతోంది అంటే.. ఒకప్పుడు ప్లాటినం.. గోల్డ్‌ను చూసి ఎక్కిరించేది. కానీ ఇప్పుడు గోల్డ్ ప్లాటినాన్ని చూసి జాలి పడుతోంది.. వైదిస్ ఓన్లీ బంగారం. అంటే..ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ ఫర్ ఎవర్ అన్నట్టుగా బిజినెస్ జరగడమే. ప్లాటినం ఇప్పుడు 10 గ్రాముల ధర తిప్పికొడితే 30 వేలుండదు. కానీ బంగారం ధర.. వారం వారం వేలకు వేలు పెరుగుతూ..లకారం..

అంటే లక్ష మార్కును టచ్ చేసేందుకు పరుగులు తీస్తోంది. ఇప్పుడు బంగారానికి ఉన్న క్రేజు డాలర్‌కు కూడా లేదు. దాని అన్‌స్టాపబుల్ మార్కెట్ స్పీడ్‌కు మధ్యతరగతికి చుక్కలు కనిపిస్తున్నాయి. దాని రేంజ్‌ ఏ లెవల్లో పెరుగుతోందంటే… 2024లో ఏకంగా 31 శాతం పెరిగింది. 2005నుంచి 2024వరకు దాని పెరుగదల శాతం 455 శాతం. ఈ రేంజ్‌లో పెరుగుతుందని ఎవరూ ఊహించలే. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే… 24క్యారెట్స్ 10గ్రాముల ధర రూ. 80450…. 22క్యారెట్స్ 10గ్రాముల ధర రూ.70375… పసిడి ప్రియులు చాలా కాలంగా బంగారం ధరలు తగ్గుతాయని ఆశిస్తూ.. కొనేందుకు ఎదురుచూస్తూ వచ్చారు. కానీ తగ్గే సూచనలు కనిపించడంలేదు. పైగా పండుగ రోజులు కావడం.,.ధన త్రయోదశి, దీపావళి కావడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంలేదు. లాస్ట్ త్రీడేస్‌లో బంగారం ధరలను పరిశీలిస్తే..ఆదివారం నాడు 24క్యారెట్స్ 10గ్రాముల ధర 80వేల 290 ఉండగా..అది సోమవారం నాటికి 79800కు తగ్గింది. అంటే ఒక్కరోజులో 490తగ్గింది. ఇంకా తగ్గుతుందని సంబరపడేలోపు మరుసటిరోజుకు అది ఏకంగా 650పెరిగింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aha OTT: గుడ్‌ న్యూస్.. ఆహాలో త్వరలో చిరంజీవ

KA: కిరణ్ అబ్బవరం “క” మూవీ.. హిట్టా ?? ఫట్టా ??

TOP 9 ET News: ఊపేసిన OG థియేట్రికల్ రైట్స్