Diwali: దీపావళిలో వెండికి వెలుగులు.. కొనుగోళ్లలో సిల్వర్‌ రికార్డ్‌ల మోత..!

Diwali: దీపావళిలో వెండికి వెలుగులు.. కొనుగోళ్లలో సిల్వర్‌ రికార్డ్‌ల మోత..!

|

Updated on: Nov 01, 2024 | 4:00 PM

వెండిపై పెట్టుబడి పెడితే రాబడి గ్యాంరెంటీ అనే అంచనాతో సంపన్నులు సైతం సిల్వర్‌కొనుగోళ్లపై ఫోకస్‌ పెట్టారు. మరోవైపు కొంటే బంగారమే కొనాలి కానీ .. అంత పెట్టుబడి ఏది? అని ఆలోచించిన సగటు జీవులు ధన్‌తేరాస్‌ సెంటిమెంట్‌తో వెండిపై మక్కువ చూపారు. ఫలితంగా వెలుగుల పండగ వేళ వెండి..

దీపావళి వెండికి వెలుగైంది.. సీజనల్‌ సేల్స్‌లో సిల్వర్‌ రికార్డుల మోత మోగిస్తోంది. గోల్డ్‌కు ధీటుగా మార్కెట్‌లో సిల్వర్‌ సైలెంట్‌గా దూసుకెళ్తోంది. ఈసారి విక్రయాల్లో వెండి దూకుడు మాములుగా లేదంటున్నారు నిపుణులు. కొంటే గోల్డ్‌ కొనాలనే అనే మాట ఎంత రీసౌండ్‌ ఇచ్చినా.. దీపావళి రేసులో పసిడికి ధీటుగా కొనుగోళ్లలో వెండి పరుగులు తీసింది. బంగారంతో వెండి కొనడం కూడా బెటరే అనే థాట్‌ ఒకవైపు, గోల్డ్‌ కొనలేకపోయినా వెండైనా కొందామనే అభిలాష మరోవైపు. వెరసి రెండు రకాలుగా మార్కెట్‌లో వెండికి గిరాకీ ఫుల్‌గా పెరిగింది. ధన్‌తేరాస్‌ సెంటిమెంట్‌తో రేటు ఎంతైనా సరే గోల్డ్‌ కొనుగోళ్లకు పోటీపడ్డారు వినియోగదారులు. దీపావళి సీజనల్‌ సేల్స్‌ హిస్టరీని సిల్వర్‌ దూకుడు షేక్‌ చేసింది. ఓ దశలో బంగారం కన్నా వెండి అమ్మకాలే రికార్డుల మోత మోగించాయి. గత ఏడాది ధన్‌తేరాస్‌ పోలిస్తే అప్పటి కన్నా వెండిరేట్‌ ఇప్పుడు 40 శాతం పెరిగింది. ధరాఘాతాన్ని పక్కన పెట్టి వెండి కోనుగోళ్లపై ఆసక్తి చూపించారు కస్టమర్స్‌. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మ్యాన్యుఫ్యాక్చర్‌ సెక్టార్‌లో వెండికి గోల్డెన్‌ ఫ్యూచర్‌ వుంది.

వెండిపై పెట్టుబడి పెడితే రాబడి గ్యాంరెంటీ అనే అంచనాతో సంపన్నులు సైతం సిల్వర్‌కొనుగోళ్లపై ఫోకస్‌ పెట్టారు. మరోవైపు కొంటే బంగారమే కొనాలి కానీ .. అంత పెట్టుబడి ఏది? అని ఆలోచించిన సగటు జీవులు ధన్‌తేరాస్‌ సెంటిమెంట్‌తో వెండిపై మక్కువ చూపారు. ఫలితంగా వెలుగుల పండగ వేళ వెండి వెలుగులు ఆల్‌ టైమ్‌ హై అనే రేంజ్‌కి చేరాయి. ఈసారి వెండి విక్రయాలు హిస్టరీని బ్రేక్‌ చేశాయన్నారు మార్కెట్‌ విశ్లేషకులు. గతంతో పోలిస్తే అధిక ధరలతో బంగారం కొనుగోళ్ల 15 శాతం తగ్గితే.. వెండి కొనుగోళ్లు 30 నుంచి 35 శాతం పెరిగాయన్నారు. గోల్డ్‌ రేట్‌ పది గ్రాములకు 80 వేలయితే కేజీ వెండి ధర లక్షను టచ్‌చేసింది. మొత్తానికి వెలుగుపూల పండుగ దీపావళిలో వెండి కొనుగోళ్లు వెలిగిపోతున్నాయి. నిశ్శబ్ద కొనుగోళ్లతో వెండి మరిన్ని రికార్డుల మోత మోగించడం ఖాయమంటున్నారు నిపుణులు.

Follow us