పరువు పోతుందనే సైలెంట్‌గా ఉంటున్నారా ?? కంప్లైంట్ అందుకే ఇవ్వడం లేదా ??
విశాఖ హనీ ట్రాప్ కేసులో దుమ్ముదులుతున్నారు పోలీసులు. ఈ క్రమంలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. హనీ ట్రాప్ కేసులో జాయ్ జమీమా కథలు ఒక్కోటిగా బయటికొస్తున్నాయి. పదుల సంఖ్యలో బాధితులను మోసం చేసింది జమీమా. సోషల్ మీడియా వేదికగా యువకులకు వలపు వల విసిరి.. వారి నుంచి లక్షలకు లక్షలు లాగేసినట్లు తెలుస్తోంది.
జాయ్ జమియా టార్గెట్ ధనవంతులు, వ్యాపారులే. బెదిరింపులకు లొంగనివారిపై రేప్ కేసులు పెట్టింది జమియా. జమీమాను రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు కంచెరపాలెం పోలీసులు. మొబైల్ డేటా ఆధారంగా అనేక ప్రశ్నలు వేశారు. ఆమె అకౌంట్స్‌లోకి జరిగిన ట్రాన్సాక్షన్లపైనా కూపీ లాగారు. ఈ విషయంలో పొంతనలేని సమాధానాలు చెప్పింది జమీమా. మురళీనగర్‌లోని ఇంట్లో మరిన్ని ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ఆమె మొత్తం మూడు ఫోన్లు వాడినట్లు నిర్ధారించారు పోలీసులు. వాటిలో ఓ ఫోన్ మిస్సింగ్. యాపిల్ లాప్‌టాప్ కూడా మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ముగ్గురు బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. మరో ఇద్దరు బాధితులు పోలీసులను సంప్రదించారు. యువకులను ముగ్గులోకి దించి.. ప్రేమపేరుతో దగ్గర అయ్యాక బెదిరించడం.. బ్లాక్‌మెయిల్ చేయడం జమీమా మోడ్రన్ దందా. ఆతర్వాత లక్షల రూపాయలు లాగేసింది జమీమా అండ్ టీమ్. ఆమె ఖాతాలో పదుల సంఖ్యలో బాధితులున్నారు. పరువు పోతుందని కొందరు బయటకు రావడంలేదంటున్నారు పోలీసులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బూచోళ్లు తిరుగుతున్నారు !! తల్లిదండ్రులారా జాగ్రత్త
Amaran: శివ కార్తికేయన్ ‘అమరన్’ సినిమా.. హిట్టా ?? ఫట్టా ??
గోవా రైల్లో బుస్.. బుస్..సెకెండ్ ఏసీలో కర్టెన్ తీసి చూస్తే షాక్..
లక్కీ భాస్కర్.. హిట్టా ?? ఫట్టా ?? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

