- Telugu News Photo Gallery Business photos BSNL Diwali Offer 365 days validity plan become more cheap know the price
BSNL కస్టమర్లకు దీవాళి కానుక.. 365 రోజుల వ్యాలిడిటితో చౌకైన ప్లాన్!
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారులకు చౌకైన ప్లాన్‌లను అందిస్తోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారీఫ్‌లను పెంచిన తర్వాత లక్షలాది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళ్తున్నారు. ఇప్పుడు వినియోగదారుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ చౌకైన ప్లాన్స్‌ను అందిస్తోంది.
Updated on: Oct 31, 2024 | 11:32 AM

జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాల టారీఫ్ ప్లాన్స్ భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఎలాంటి ప్లాన్ష్ పెంచలేదు. పైగా చౌకైన ప్లాన్స్‌ను తీసుకువస్తోంది. కంపెనీ తన లాంగ్ వాలిడిటీ చౌక ప్లాన్‌ను మరింత చౌకగా చేసింది. దీపావళి కానుకగా ఈ ప్లాన్ ధర రూ. 100 తగ్గించారు.

1999 రూపాయల ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌పై 100 రూపాయల తగ్గింపు లభిస్తుంది. తగ్గింపు తర్వాత ఈ ప్లాన్‌ను ఇప్పుడు రూ. 1899కి కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులు ఈ ప్లాన్‌లో 600 జీబీ హై స్పీడ్ డేటాను పొందుతారు మరియు అది కూడా 365 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.

ఈ ప్లాన్ 600 GB డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. సుదీర్ఘ వ్యాలిడిటీ, తక్కువ ధరతో ఈ ప్లాన్ మీ SIMని ఒక సంవత్సరం పాటు యాక్టివ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.

రిలయన్స్ జియో కూడా రూ. 1899 ప్లాన్‌ని కలిగి ఉంది. అయితే ఈ ప్లాన్ 365కి బదులుగా 336 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ మొత్తం 24 GB హై స్పీడ్ డేటా, ఉచిత కాలింగ్,3600 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం రూ. 1999 వార్షిక ప్లాన్‌ను కలిగి ఉంది. అది 365 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. ఈ 24 జీబీ డేటా ప్లాన్‌తో, 100 ఎస్‌ఎంఎస్, అపరిమిత ఉచిత కాలింగ్ ఉంటుంది. ఈ ప్లాన్‌తో అపోలో 24/7, వింక్ మ్యూజిక్, స్పామ్ ప్రొటెక్షన్, ఎక్స్‌ట్రీమ్ ప్లే వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

Vodafone Idea రూ. 1999 ప్లాన్‌తో ప్రీపెయిడ్ వినియోగదారులు 24 GB డేటా, 3600 SMS, ఉచిత కాలింగ్ సదుపాయం ఉంది. నవంబర్ 7 వరకు ఆ ఆఫర్ ఉంటుంది.




