AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeping for Healthy Heart: నిద్ర కొద్దీ ఆయుష్షు.. రాత్రిళ్లు ఎంత తక్కువగా నిద్రపోతే త్వరగా హార్ట్‌ ఎటాక్‌ ఖాయం

గుండె ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. రాత్రిళ్లు హాయిగా నిద్రపోయారంటే గుండె జబ్బులు జీవాతకాలంలో రమ్మన్నారావట. తాజాగా అధ్యనాల్లో ఈ విషయం వెల్లడైంది. తక్కువ నిద్ర ఉన్నవారిలో రక్తపోటు పెరిగి అనతికాలంలో గుండె వ్యాధులు వస్తున్నట్లు గుర్తించారు..

Sleeping for Healthy Heart: నిద్ర కొద్దీ ఆయుష్షు.. రాత్రిళ్లు ఎంత తక్కువగా నిద్రపోతే త్వరగా హార్ట్‌ ఎటాక్‌ ఖాయం
ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. మంచి రాత్రి నిద్ర రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర కావాలి. మంచి రాత్రి నిద్ర హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇటీవలి పరిశోధనల ప్రకారం తక్కువ నిద్ర అధిక రక్తపోటు సమస్యను పెంచుతుందని తేలింది. ఇది క్రమంగా గుండెపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనం ప్రకారం ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడమే అనారోగ్యానికి మూలకారణం.
Srilakshmi C
|

Updated on: Oct 31, 2024 | 12:15 PM

Share

నిద్ర మనకు చాలా ముఖ్యం. మంచి నిద్ర మనల్ని శక్తివంతంగా, రిఫ్రెష్‌గా ఉంచుతుంది. ముఖ్యంగా రాత్రిపూట మంచి నిద్ర పోవడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. తాజా పరిశోధన ప్రకారం, తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు సమస్యను ప్రేరేపిస్తున్నట్లు తేలింది. అది క్రమేణా గుండెపై ప్రభావం చూపుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయనం ప్రకారం, ఏడు గంటల కంటే తక్కువ నిద్ర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా మనదేశంలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ నిద్రపోతారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోయిన తెల్లవారుజాముననే నిద్రలేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ నిద్ర వల్ల స్త్రీల గుండె ఆరోగ్యం ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఏడు గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఏడు శాతం పెరుగుతుందని, నిద్ర వ్యవధి ఐదు గంటల కంటే తక్కువ ఉంటే 11 శాతం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది.

ఆరోగ్యకరమైన గుండెకు ఏడెనిమిది గంటల నిద్ర ఉత్తమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే తరచుగా నిద్రలో మేల్కొనడం, పేలవమైన నిద్ర అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ విషయం 16 అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందులో గత 5 సంవత్సరాలలో 6 దేశాల నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజల నుంచి సేకరించిన డేటాను పరిశీలించారు. వీరిలో తక్కువ నిద్ర అలవాటు ఉన్నవారు అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. అలాగే ఐదు గంటల కంటే తక్కువ నిద్రపోయేవారిలో అధిక రక్తపోటు సమస్య సర్వసాధారణమని వీరి పరిశోధనలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం ఎంత తక్కువ నిద్రపోతారో, భవిష్యత్తులో మీకు అధిక రక్తపోటు వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉందని డాక్టర్ కవే హొస్సేనీ చెప్పారు. అందువల్ల, ప్రతి రోజూ ఏడెనిమిది గంటల నిద్ర మీ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదేవిధంగా, మధుమేహం, ధూమపానం అధిక రక్తపోటు ప్రమాదాన్ని 20 శాతం పెంచుతాయి.

జనాల్లో నిద్ర ఎందుకు తగ్గుతుందంటే..

  • చెడు జీవనశైలి, అర్థరాత్రి వరకు మెలకువగా ఉండడం, రాత్రంతా మొబైల్, టీవీ చూసే అలవాటు వల్ల నిద్రకు భంగం వాటిల్లుతోంది.
  • ధూమపానం, మద్యపానం కూడా నిద్ర సమస్యలను కలిగిస్తాయి.
  • ఆందోళన, డిప్రెషన్, స్లీప్ అప్నియా సమస్యలు నిద్రలో సమస్యలను కలిగిస్తున్నాయి.
  • రాత్రి షిఫ్టులలో అతిగా తినడం నిద్ర అలవాట్లను పాడుచేస్తుంది.

నిద్రను ఎలా మెరుగుపరచుకోవాలంటే..

  • రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి
  • రాత్రిపూట ధూమపానం మరియు మద్యం సేవించవద్దు
  • అర్థరాత్రి వరకు మొబైల్, టీవీ చూడవద్దు
  • ఒత్తిడిని సక్రమంగా నిర్వహించాలి
  • రాత్రి త్వరగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి
  • లైట్లు డిమ్ చేసుకుని, తేలికపాటి సంగీతాన్ని ప్లే చేయడం, మంచి పుస్తకాలు చదవడం

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.