Onion Pickle: ఉల్లిపాయతో నిల్వ పచ్చడి.. తినడం మొదలు పెడితే మాట్లాడరు..

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఈ సామెత ఊరికే రాలేదు. ఉల్లిపాయలతో ఉండే లాభాలు వేరు. ఉల్లిపాయలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి. వీటితో పలు రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయతో నిల్వ పచ్చడి కూడా పెట్టుకోవచ్చు..

Onion Pickle: ఉల్లిపాయతో నిల్వ పచ్చడి.. తినడం మొదలు పెడితే మాట్లాడరు..
Onion Pickle
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 31, 2024 | 10:15 PM

నిల్వ పచ్చళ్లలో ఎక్కువగా అందరూ ఉపయోగించేది మామిడికాయ పచ్చడి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా నాన్ వెజ్‌ పచ్చళ్లు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు అన్ని రకాల కూరగాయలతో కూడా నిల్వ పచ్చళ్లు పెడుతున్నారు. వీటిల్లో ఉల్లిపాయ కూడా ఒకటి. ఈ ఉల్లిపాయ నిల్వ పచ్చడి రుచి చూశారంటే వదిలి పెట్టరు. చాలా రుచిగా ఉంటుంది. స్పైసీగా రుచిగా ఉంటుంది. చేయడానికి కూడా పెద్దగా సమయం పట్టదు. చాలా సింపుల్‌గా, త్వరగా చేసేయవచ్చు. మరి ఈ ఉల్లిపాయ నిల్వ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

ఉల్లిపాయ నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

ఉల్లిపాయలు, ఆయిల్, ఉప్పు, ఎండు మిర్చి, చింత పండు, బెల్లం, తాళింపు దినుసులు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు.

ఉల్లిపాయ నిల్వ పచ్చడి తయారీ విధానం:

ముందుగా ఎండు మిర్చిలో వేడి నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. అలాగే చింత పండులో కూడా నీళ్లు వేసి నానబెట్టాలి. ఇప్పుడు బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు శుభ్రంగా కడిగి ముక్కలు పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా కోసి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఈ ఉల్లి ముక్కలు, ఎండు మిర్చి, బెల్లం తురుము, చింత పండు వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును పక్కన పెట్టుకోండి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఒక కడాయి తీసుని ఆయిల్ వేసి వేడి చేసి ఇంగువ, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, తాళింపు దినుసులు వేసి వేయించాలి. ఈ తాళింపులో మిక్సీ పట్టిన ఉల్లి మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఉల్లి నిల్వ పచ్చడి సిద్ధం. ఈ పచ్చడి టిఫిన్స్‌లోకి, వేడి అన్నంలోకి, చపాతీలోకి కూడా రుచిగా ఉంటుంది.