AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rolex Watch: ఇల్లు కట్టిన కాంట్రక్టర్‌కి రూ.కోటి విలువైన వాచ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన యజమాని.. ఎందుకో తెలుసా?

విశాలమైన స్థలంలో డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఓ వ్యాపారి ముచ్చటపడ్డాడు. ఓ కాంట్రాక్టర్ కి పనులు అప్పగించి రెండేళ్లలో పూర్తి చేయాలని చెప్పాడు. అయితే సదరు కాంట్రాక్టర్ మాత్రం రోజూ మనం చూసే అవినీతి రకం కాదు. నిజాయితీగా ఎంతో నిబధతతో బంగ్లాను అనుకున్న టైంకి రెట్టింపు నాణ్యతతో కట్టి యజమానికి అప్పగించాడు. అతడి నిజాయితీకి ఫిదా అయిన యజమాని..

Rolex Watch: ఇల్లు కట్టిన కాంట్రక్టర్‌కి రూ.కోటి విలువైన వాచ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన యజమాని.. ఎందుకో తెలుసా?
Businessman Gifts Rolex Watch To Contractor
Srilakshmi C
|

Updated on: Nov 01, 2024 | 9:22 AM

Share

చండీఘడ్‌, నవంబర్‌ 1: పంజాబ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తన డ్రీమ్‌ హౌస్‌ను అద్భుతంగా నిర్మించిన కాంట్రాక్టర్‌కు విలువైన బహుమతి ఇచ్చారు. ఏకంగా రూ. 1 కోటి రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిరాక్‌పూర్ సమీపంలోని ప్రాజెక్ట్‌ను సందర్శించిన వ్యాపారవేత్త గుర్దీప్ దేవ్ బాత్.. ఆ బిల్డింగ్‌ కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూపా అంకిత భావానికి ఫిదా అయ్యాడు. ఎంతో నాణ్యతతో, అంకితభావంతో అనుకన్న టైంకి ప్రాజెక్ట్ డెలివరీ చేసినందుకు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. విలువైన బహుమతితో అతడి నిజాయితీని సత్కరించాలని నిర్ణయించుకున్నాడు. 18-క్యారెట్ బంగారంతో తయారు చేసిన రోలెక్స్ వాచ్‌ను బిల్డింగ్‌ కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూపాకు బహుకరించాడు.

పంజాబ్‌లోని జిరాక్‌పూర్ సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆధునిక హంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో నిర్మించేందుకు పంజాబ్‌లోని షాకోట్‌కు చెందిన రాజిందర్ సింగ్ రూపా అనే కాంట్రాక్టర్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఒప్పుకున్న షెడ్యూల్‌లో దీనిని పూర్తి చేయడానికి రూపా 200 మంది వర్కర్లతో పని చేయడం ప్రారంభించారు. అన్ని ఆధునిక సదుపాయాలు కలిగిన ఈ ఎస్టేట్ 9 ఎకరాల స్థలంలో నిర్మించారు. రూపా నిర్మించిన ఎస్టేట్‌లో విశాలమైన హాళ్లు, ల్యాండ్‌స్కేప్ చేసిన గార్డెన్‌లు, స్టైల్ – ప్రాక్టికాలిటీ రెండూ ఉట్టిపడేలా ప్రత్యేకమైన నిర్మాణాలు ఇందులో ఉన్నాయి. భవనం యజమాని గుర్దీప్‌ మాట్లాడుతూ..’ప్రాజెక్ట్‌ పూర్తి చేయడంలో టైమ్‌లైన్‌ పట్ల రూపా నిబద్ధత మాటల్లో వ్యక్తం చేయలేనిది. కోరిన దానికంటే అత్యంత అద్భుతంగా నా ఇల్లు నిర్మిచాడు. ఆర్కిటెక్చర్‌ రంజోద్ సింగ్ తయారు చేసిన డిజైన్‌తో ఎస్టేట్‌ను, దాని చుట్టు సరిహద్దు గోడను అద్భుతంగా నిర్మించాడు. ఇప్పుదిడి ప్రైవేట్ కోటగా మారింది. అందుకే కాంట్రాక్టర్‌ రూపా నిబద్ధతకు కృతజ్ఞతగా రోలెక్స్ వాచ్‌ బహుకరించినట్లు’ తెలిపారు.

కాంట్రాక్టర్‌ రూపా మాట్లాడుతూ..’ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేయడం నిజంగా ఓ సవాలని రూపా అన్నారు. అందమైన ఊహకు జీవం పోయడంలో శ్రామిక శక్తి, సంఘటిత కృషి, సహకారం వల్ల సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలిగామని ఆయన అన్నారు. ఈ విథమైన క్యాలిబర్ బంగ్లా నిర్మించడం అంత తేలికైన పని కాదని, ముఖ్యంగా రాజస్థానీ కోటల స్ఫూర్తిని ప్రతిబింబించేలా నిర్మించడం చిన్న విషయం కాదని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.