AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: దీపావళి పటాకులను నగలుగా ధరించిన యువకుడు.. చేతిలో వెలిగే దీపంతో డ్యాన్స్..

వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు అమ్మాయిలా మేకప్ వేసుకున్నాడు. తెల్లగా మెరిసే లెహంగా-చోలీని ధరించి కనిపించాడు. అంతేకాదు నగలను అలంకరించేందుకు ఏకంగా దీపావళి బాణాసంచాను ఉపయోగించాడు. పటాకుల దండను వేసుకున్నాడు. బాంబులు, చిచ్చు బుడ్లు వంటి వాటిని హారం, చెవి పోగులు వంటి వాటిని నగలుగా అలంకరించుకున్నాడు. చేతిలో దీపంతో సందడి చేశాడు.

Viral Video: దీపావళి పటాకులను నగలుగా ధరించిన యువకుడు.. చేతిలో వెలిగే దీపంతో డ్యాన్స్..
Viral Video
Surya Kala
|

Updated on: Nov 01, 2024 | 12:26 PM

Share

సోషల్ మీడియాలో వింత దుస్తులు అనగానే ఉర్ఫీ జావేద్ గుర్తుకొస్తుంది. ఉర్ఫీ డిఫరెంట్ దుస్తులతో సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. కెమెరాలో కనిపించడానికి ఏ టైప్ దుస్తులను అయినా ధరించడానికి వెనుకాడదు. ఉర్ఫీ ఎవరూ ఊహించని వాటితో తయారు అయిన దుస్తులను కూడా తయారు చేస్తుంది. వాటిని ఏ మాత్రం నదురుబెదురూ లేకుండా ధరిస్తుంది. అయితే ఉర్ఫీ జావేద్ అసాధారణమైన ఫ్యాషన్ సెన్స్‌కి పోటీగా మార్కెట్‌లోకి కొత్త గా వ్యక్తీ వచ్చినట్లు తెలుస్తోంది. ఓ కుర్రాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలోని ఓ యువకుడు ఉర్ఫీ కంటే ఒక అడుగు ముందుకేశాడని పబ్లిక్ అంటున్నారు. ఇందులో ఈ యువకుడు దీపావళి రోజున పేల్చిన బాణాసంచాకు సంబంధించిన వాటిని నగలుగా తయారు చేసుకుని వాటిని ఆభరణాలుగా ధరించాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు తెల్లటి మెరిసే లెహంగా-చోలీని ధరించాడు. పటాకుల దండ, పాటకులతో చేసిన చెవిపోగులు, బాంబుల హారం వంటి నగలను తయారు చేసి ధరించాడు. అంతేకాదు ఆ యువకుడు తన చేతిలో వెలుగుతున్న దీపాన్ని కూడా పట్టుకున్నాడు. అదే సమయంలో ‘సజ్నా మేరా ఆజ్ పగ్లాయా హై’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది. ఇది పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

కొంత మంది సోషల్ మీడియా యూజర్లు ఈ విషయాన్నీ చాలా తేలిగ్గా తీసుకున్నారు. అయితే ఇలాంటి డ్రెస్ వేసుకోవడం, ధరించడం వల్ల ప్రమాదాలే కాకుండా.. ఈ మాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా తీవ్ర ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, పటాకుల దగ్గరకు మండుతున్న దీపాన్ని తీసుకుని వెళ్ళడం అనేది ప్రమాదకరమైన నిర్ణయం.

ఇక్కడ వీడియో చూడండి

View this post on Instagram

A post shared by Ravi Kumar (@ravisagar88)

వీడియోలో కనిపిస్తున్న యువకుడిని కంటెంట్ సృష్టికర్త రవిసాగర్‌గా గుర్తించారు. ఏడు రోజుల క్రితం @ravisagar88లో అప్‌లోడ్ చేయబడిన ఈ వీడియోను ఇప్పటివరకు 35 వేల మందికి పైగా లైక్ చేసారు. అంతేకాదు రకరకాలా ఫన్నీ కామెంట్స్ తో కామెంట్ చేస్తున్నారు. ఒకరు దీపం సోదరుడి దగ్గర నుంచి తీసుకోక పొతే ఈ అలంకరణ ప్రాణానికి హనికరం అని అంటే.. సుట్లీ బాంబు ఎప్పుడు పేలుతుందా అని ఎదురు చూస్తున్నాను అని మరొకరు చెప్పారు అంతేకాదు వెలుగుతున్న దీపం చెవిపోగుల తాకనిస్తే అప్పుడు తెలుస్తుంది.. అసలా సంగతి అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రేండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..