కాలుష్యం వలన దగ్గు ప్రారంభమైతే.. ఈ 4 ఇంటి చిట్కాలు మంచి ఉపశమనం ఇస్తాయి..

దీపావళి పండగ సందర్భంగా కాలుష్యం కారణంగా దగ్గు ప్రారంభమై చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నిరంతర దగ్గు కడుపు , పక్కటెముకల నొప్పికి కారణమవుతుంది. ఈ సమస్యను నివారించడానికి మెడిసిన్ కు బదులుగా కొన్ని ఇంటి నివారణలను అనుసరించవచ్చు.ఈ చిట్కాలు దగ్గును నియంత్రించవచ్చు.

కాలుష్యం వలన దగ్గు ప్రారంభమైతే.. ఈ 4 ఇంటి చిట్కాలు మంచి ఉపశమనం ఇస్తాయి..
Cough Home Remedies
Follow us

|

Updated on: Nov 01, 2024 | 9:46 AM

దీపావళి సందర్భంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌ సహా అనేక ప్రాంతాల్లో కాలుష్యం కూడా గణనీయంగా పెరిగింది. రాజధాని ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచీ 556గా నమోదైంది. పెరుగుతున్న కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. విషపూరితమైన గాలి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, గొంతునొప్పి, కళ్ల మంటలు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే కాలుష్యం వల్ల వచ్చే దగ్గు సమస్యతో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దగ్గు పెరిగినప్పుడు, దగ్గు కారణంగా కడుపు, పక్కటెముకల నొప్పి ప్రారంభమవుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే.. దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు.. కొన్ని ఇంటి నివారణలను ఉపయోగించవచ్చు. దీంతో దగ్గును చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు.

అల్లం ప్రయోజనకరంగా ఉంటుంది

మెడికల్ న్యూస్ టుడే ప్రకారం కాలుష్యం వల్ల వచ్చే దగ్గును వదిలించుకోవడానికి అల్లం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది దగ్గు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీని కోసం తేనెతో చిన్న అల్లం ముక్కను కలిపి తినడం వలన మంచి ఉపయోగం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

తేనె

దగ్గు సమస్య ఉన్నవారికి తేనె కూడా చాలా మేలు చేస్తుంది. డెక్స్ట్రోమెథోర్ఫాన్ అనే మూలకం ఇందులో ఉంది. కనుక తేనె కఫాన్ని నియంత్రిస్తుంది. దీని కోసం మీరు ఒక చెంచా తేనె తినవచ్చు లేదా గోరువెచ్చని నీటిలో కలిపి త్రాగవచ్చు.

ఉప్పు నీటితో పుక్కిలించడం

ఉప్పు నీటితో పుక్కిలించడం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థ శుభ్రపడుతుంది. ఇది గొంతు నొప్పి , దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలపండి. రోజుకు కనీసం రెండుసార్లు పుక్కిలించండి. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

ఆవిరి పట్టడం

శ్లేష్మంతో దగ్గుతో ఇబ్బంది పడుతుంటే ఉపశమనం కోసం ఆవిరిని పట్టండి. రోజుకు రెండుసార్లు 10 నుండి 15 నిమిషాలు ఆవిరి పట్టడం వలన మంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గుతో బాధపడేవారు ఆవిరి పట్టడం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.