Joint Pains: కీళ్ల నొప్పులా.? మీరు తినే ఈ ఫుడ్ కూడా కారణమే..

చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది తీసుకునే ఆహారమే. అవును మనం తీసుకునే ఆహారం కీళ్ల నొప్పులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కీళ్ల నొప్పులు పెరగడానికి కారణమయ్యే ఆ ఆహారపదర్థాలు ఏంటి.? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి.?

Joint Pains: కీళ్ల నొప్పులా.? మీరు తినే ఈ ఫుడ్ కూడా కారణమే..
Joint Pains
Follow us

|

Updated on: Oct 31, 2024 | 9:45 PM

ప్రస్తుతం కీళ్ల నొప్పులు సర్వసాధారణంగా మారిపోయాయి. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే కనిపించిన ఈ సమస్య ఇప్పుడు యువతలో కూడా ఈ సమస్య ఎక్కువుతోంది. చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది తీసుకునే ఆహారమే. అవును మనం తీసుకునే ఆహారం కీళ్ల నొప్పులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కీళ్ల నొప్పులు పెరగడానికి కారణమయ్యే ఆ ఆహారపదర్థాలు ఏంటి.? ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా కీళ్ల నొప్పులు తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిల్వ చేసిన షుగర్‌ ఉండే ఫుడ్‌ను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య త్వరగా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* సోయా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొందరిలో మాత్రం ఇది కీళ్ల నొప్పులు పెరగడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. సోయా తిన్నవెంటనే కీళ్ల నొప్పులు వేధిస్తుంటే వెంటనే మానేయాలని చెబుతున్నారు.

* సీ ఫుడ్‌ ఎక్కువగా తీసుకున్నా కొందరిలో కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది. చేపలు, రొయ్యలో ఉండే ప్యూరిన్స్‌ శరీరంలో నొప్పులకు దారి తీస్తుంది. కాబట్టి కీళ్ల నొప్పులు ఉన్న వారికి ఈ పుడ్‌కు దూరంగా ఉండడమే మంచిది.

* కీళ్లనొప్పులు పెరగడానికి రెడ్‌ మీట్ కూడా కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. రెడ్‌మీట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, నడుము నొప్పి పెరుగుతుంది. శరీరంలో యూరిక్‌ యాసిడ్ పెరగడానికి రెడ్‌ మీట్ కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

* కొన్ని రకాల పిండి పదార్థాలు కూడా కీళ్ల నొప్పులకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బియ్యం, గోధుమల్లో ఉండే.. గ్లూటెన్‌ను కొందరిలో అలర్జీలను కలగిస్తుంది. కీళ్ల నొప్పులను పెంచుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఇవి తినండి..

కీళ్ల నొప్పులు తగ్గాలంటే ప్రతీరోజూ తీసుకునే ఆహారంలో.. పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో వాపును, నొప్పులను తగ్గిస్తుంది. అలాగే ప్రతీరోజూ పాలను తీసుకోవాలి. అయితే చక్కెర తక్కువగా వేసుకోవాలి. పాలలో పసుపు కలుపుకొని తీసుకోవడం వల్ల మరింత మేలు జరుగుతుంది. అలాగే బాదం, వాల్‌నట్స్‌ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా కీళ్ల నొప్పులు దూరమవుతాయి. విటమిన్‌ కే అధికంగా ఉండే పాలకూర, బ్రోకలీని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది.