ప్రస్తుతం కాలంలో చాలామంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శారీరక శ్రమ లేకపోవడం, పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం ఇవన్నీ ఊబకాయం బారిన పడేలా చేస్తాయి.. అయితే, అనారోగ్యకరమైన వ్యాధులకు ప్రధాన కారణం ఊబకాయం (బరువు పెరగడం) అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం వయస్సు కారణంగా మాత్రమే కాదు, జీవనశైలి ద్వారా కూడా ప్రభావితమవుతుందని.. ముఖ్యంగా ఊబకాయం కూడా ఓ కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, యువత తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.. ఇంకా బరువు నియంత్రణలో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.