- Telugu News Photo Gallery If the tension is not reduced, heart palpitations are sure to come, Check Here is Details
Heart Stroke: టెన్షన్ తగ్గించుకోపోతే.. గుండె పోటు రావడం ఖాయం..
ఇటీవల కాలంలో గుండె పోటుతో చనిపోయే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కాబట్టి గుండె పోటు రాకుండా ఉండేందుకు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోవాలి..
Updated on: Oct 31, 2024 | 10:00 PM

ప్రస్తుత కాలంలో సాధారణంగా మారిపోయిన అనారోగ్య సమస్యల్లో గుండె జబ్బులు ఒకటి. గుండె పోటుతో ఈ మధ్య కాలంలో చాలా మంది మరణిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారు సైతం హార్ట్ స్ట్రోక్‌తో చనిపోతున్నారు.

గుండె సరిగ్గా పని చేయకపోయినా, ఆక్సిజన్ శరీరంలోని వివిధ భాగాలకు సరిగ్గా చేరదు. హార్ట్ వాల్వ్ ఫెయిల్యూర్ వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన అలసటకు కారణమవుతాయి. అధిక ఒత్తిడి కండరాల నొప్పులకు కారణమవుతుంది. దీని వల్ల శ్వాస సమస్యలు తలెత్తుతాయి.

స్ట్రెస్‌ని తట్టుకోలేక చాలా మంది అక్కడికక్కడే మరణిస్తున్నారు. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ట్రై చేయాలి. చాలా మంది ఆఫీసుల్లో, ఇంట్లో ఉండే టెన్షన్ కారణంగా మద్యం సేవించడం, ధూమపానం చేస్తూ ఉంటున్నారు.

ఇవి కాస్తా గుండెపై ప్రభావం చూపిస్తున్నాయి. దీర్ఘకాలికంగా ఒత్తాడిని తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గి.. రక్త నాళాల్లో వాపు పెరిగి.. దెబ్బతింటున్నాయి. దీంతో హార్ట్ ఎటాక్ వంటివి వస్తున్నాయి.

కాబట్టి ఒత్తిడిని తగ్గించుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. స్ట్రెస్‌ని తగ్గించుకునే టెక్నిక్స్ తెలుసుకోవాలి. ఎక్కువగా రెస్ట్ తీసుకునేందుకు, నలుగురితో కలిసి మాట్లాడేందుకు ట్రై చేయండి.




