Govardhan Puja 2024: నవంబర్ 1 లేదా 2… గోవర్ధన్ పూజ ఎప్పుడు జరుపుకోవాలి? పూజ విధి శుభ సమయం మీ కోసం

ఈ ఏడాది ఆశ్వయుజ అమావాస్య తిధి రెండు రోజులు వచ్చింది. దీంతో దీపావళి పండగను రెండు రోజులు అంటే అక్టోబర్ 31వ తేదీ, నవంబర్ 1వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ కారణంగా, గోవర్ధన పూజ తేదీకి సంబంధించి గందరగోళం నెలకొంది. ఈ పండుగను నవంబర్ 1న, మరికొందరు నవంబర్ 2న జరుపుకోవాలని కొందరు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో నవంబర్‌లో గోవర్ధన్ పూజ ఏ రోజున జరుపుకోవడం శుభ ప్రదమో తెలుసుకుందాం.

Govardhan Puja 2024: నవంబర్ 1 లేదా 2... గోవర్ధన్ పూజ ఎప్పుడు జరుపుకోవాలి? పూజ విధి శుభ సమయం మీ కోసం
Govardhan Puja 2024
Follow us
Surya Kala

|

Updated on: Nov 01, 2024 | 7:42 AM

ఐదు రోజుల దీపావళి పండుగలో నాల్గవ రోజున గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు. ఈ రోజున గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన కన్నయ్యను పూజించే సంప్రదాయం ఉంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శుక్ల పక్షం ప్రతిపాద తేదీ రోజున గోవర్ధన పూజ పండుగను జరుపుకుంటారు. గోవర్ధన పూజను అన్నకూట్ అని కూడా (అంటే “ఆహార పర్వతం) పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజున హిందువులు తమ ఇళ్లలో దేవుడికి కృతజ్ఞతను తెలియజేయడానికి అనేక రకాల రుచికరమైన వంటకాలను తయారు చేసి సమర్పిస్తారు. గోవర్ధన పూజ రోజున ఆవు పేడతో గోవర్ధన మహారాజ్ విగ్రహాన్ని ఇంట్లో తయారు చేసి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తారు.

ఈసారి దీపావళి రెండు రోజులు రావడంతో గోవర్ధన్ పూజ తేదీ విషయంలో గందరగోళం నెలకొంది. గోవర్ధన్ పూజను నవంబర్ 1వ తేదీన జరుపుతారా లేక నవంబర్ 2వ తేదీన జరుపుకుంటారా అనే గందరగోళం ప్రజల్లో నెలకొంది. 2024లో గోవర్ధన్ పూజ ఎప్పుడు జరుపుకోవాలి? గోవర్ధన్ పూజ శుభ సమయం ఎప్పుడు అనే విషయం తెలుసుకుందాం.

2024లో గోవర్ధన్ పూజ ఎప్పుడు? (గోవర్ధన్ పూజ 2024 ఎప్పుడు)

కార్తీక ప్రతిపద తిథి నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6.16 గంటలకు ప్రారంభమవుతుంది. కార్తీక ప్రతిపాద తిధి నవంబర్ 2, రాత్రి 8:21 గంటలకు తేదీ ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం గోవర్ధన పూజ 2 నవంబర్ 2024 శనివారం జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి

గోవర్ధన్ పూజ శుభ సమయం ఎప్పుడంటే

ఈ సంవత్సరం గోవర్ధన్ పూజ పండుగ నవంబర్ 2వ తేదీన వచ్చింది. ఈ రోజున నవంబర్ 2వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.45 గంటల వరకు గోవర్ధన్ పూజ శుభ సమయం. గోవర్ధన పూజ కోసం మీకు 2 గంటల 45 నిమిషాల సమయం లభిస్తుంది.

గోవర్ధన పూజ సమర్పణ

గోవర్ధన పూజ రోజున వివిధ రకాల ఆహారాన్ని తయారు చేసి సమర్పించే సంప్రదాయం ఉంది. శ్రీకృష్ణుడికి అన్నకూట్‌తో పాటు 56 రకాల ఆహార పదార్ధాలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు.

ఇంట్లో గోవర్ధన పూజ ఎలా చేయాలంటే

  1. గోవర్ధన పూజ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శ్రీకృష్ణుడిని పూజించండి.
  2. దీని తరువాత మధ్యాహ్నం ఇంటి ప్రాంగణంలో గోవర్ధన్ మహారాజ్ విగ్రహాన్ని తయారు చేయండి.
  3. గోవర్ధన్ మహారాజ్‌తో పాటు ఆవు, దూడ, పర్వతా విగ్రహాలను కూడా తయారు చేయండి
  4. దీని తరువాత కన్నయ్య సహా అన్ని విగ్రహాలను పువ్వులు, పసుపు కుంకుమ చందనంతో అలంకరించండి.
  5. మధ్యమధ్యలో కుటుంబ సమేతంగా కృష్ణుడిని స్తుతిస్తూ భజనలు చేయండి
  6. దీని తర్వాత పాలు, తాంబూలం, పాల పదార్ధాలు, అన్నకూట్ మొదలైన వాటిని నైవేద్యంగా పెట్టాలి.
  7. తర్వాత కుటుంబ సభ్యులందరితో కలిసి నీళ్లలో పాలు కలిపి ఏడుసార్లు కన్నయ్యకు ప్రదక్షిణలు చేయండి
  8. ఇలా ఏడుసార్లు ప్రదక్షిణాలు చేసిన తరువాత, నెయ్యి దీపం వెలిగించి హారతి ఇవ్వండి.
  9. అనంతరం గోవర్ధన్ మహారాజ్‌ని స్తుతించి.. ఇంటిలోని పెద్దల నుండి ఆశీర్వాదం తీసుకోండి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.