AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. యూఎస్‌కు వెళ్లాల్సిన 60 విమానాలు రద్దు

విమాన ప్రయాణికులకు ఎయిర్‌లైన్‌ కంపెనీ షాక్ ఇచ్చింది. నవంబర్, డిసెంబర్‌లో ఇండియా నుంచి అమెరికా వెళ్లాల్సిన 60 విమానాలను రద్దు చేసినట్టు ప్రకటించింది. ప్రయాణికులకు డేట్ మార్చుకునే అవకాశం ఇవ్వడంతో పాటు టికెట్‌ డబ్బులు రిటర్న్‌ చేస్తున్నట్టు వెల్లడించింది.

Air India: ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. యూఎస్‌కు వెళ్లాల్సిన  60 విమానాలు రద్దు
Air IndiaImage Credit source: Tata Group
Surya Kala
|

Updated on: Nov 01, 2024 | 6:37 AM

Share

టాటా యాజమాన్యంలోని ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ మధ్య భారత్‌ నుంచి యూఎస్‌కు నడవాల్సిన 60 విమానాలను క్యాన్సిల్ చేసింది. నిర్వహణ సమస్యల కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఆయా విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. పీక్‌ ట్రావెల్‌ పీరియడ్‌లో రద్దయిన విమానాల్లో శాన్‌ ఫ్రాన్సిస్కో, చికాగో విమానాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎయిర్ ఇండియా గ్రూప్‌ ద్వారా నడుస్తున్న ఇతర విమానాల్లో తర్వాతి రోజులకు సర్వీస్‌ని ఆఫ్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఎయిర్‌ ఇండియా మెయింటెనెన్స్‌ కోసం పంపుతున్న ఎంఆర్‌వో ఆపరేటర్‌ నుంచి విమానాలను తిరిగి పొందడంలో జాప్యం జరుగుతుంది. సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని వైడ్‌బాడీ విమానాలు సైతం నిలిచిపోవడంతో విమానాల కొరత ఏర్పడుతుంది. దీంతో విమానాలు రద్దు చేయాల్సి వచ్చిందని వివరించింది కంపెనీ. విమానాల రద్దుపై ఎయిర్‌ ఇండియా విచారం వ్యక్తం చేసింది. రద్దయిన విమానాల్లో టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు సమాచారం అందించామని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. విమానాలు రద్దయిన నేపథ్యంలో ఉచితంగా డేట్‌ను మార్చుకునేలా అవకాశం కల్పించడంతో పాటు పూర్తిగా టికెట్‌ డబ్బులను రీఫండ్‌ చేయనున్నట్లు పేర్కొంది.

శాన్‌ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్, చికాగో, నెవార్క్‌, న్యూయార్క్‌కు వెళ్లాల్సిన 60 విమానాలను రద్దు చేసింది ఎయిరిండియా. ఢిల్లీ, చికాగో మధ్య 14 విమానాలు, ఢిల్లీ- వాషింగ్టన్‌ మధ్య 28 విమానాలు, ఢిల్లీ శాన్‌ఫ్రాన్సిస్కో మధ్య 12 విమానాలు, ముంబై న్యూయార్క్ మధ్య నాలుగు ఫ్లైట్లు, ఢిల్లీ-నెవార్క్‌ మధ్య రెండు విమానాలు రద్దు అయ్యాయి. భవిష్యత్‌లో నిర్వహణ లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఎయిర్‌లైన్‌ సంస్థ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..