Diwali 2024: దీపాలు, రంగోలీ, బాణసంచాతో దేశం వెలిగిపోయింది.. ఈరోజు కూడా దీపావళి జరుపుకోవచ్చు.. పూజ శుభసమయం ఎప్పుడంటే

దీపాలు, రంగోలీ, బాణసంచా... దీపాలతో వెలిగిపోయింది దేశం. అయితే అక్టోబర్ 31న దీపావళి పండగ జరుపుకోని వారు ఈ రోజు కూడా దీపావళిని జరుపుకోవచ్చు, ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసం అమావాస్య తిధి రెండు రోజులు వచ్చింది. దీని కారణంగా దీపావళిని జరుపుకోవడంలో గందరగోళం ఏర్పడింది. అయితే దేశ వ్యాప్తంగా దీపావళిని అక్టోబర్ 31న ఘనంగా జరుపుకున్నారు. అమావాస్య తిథి రెండు రోజు మిగిలి ఉన్నందున.. దీపావళి పండుగను కూడా నవంబర్ 1 న జరుపుకోవచ్చు.

Diwali 2024: దీపాలు, రంగోలీ, బాణసంచాతో దేశం వెలిగిపోయింది.. ఈరోజు కూడా దీపావళి జరుపుకోవచ్చు.. పూజ శుభసమయం ఎప్పుడంటే
Diwali 2024
Follow us
Surya Kala

|

Updated on: Nov 01, 2024 | 6:28 AM

దీపాల పండుగ దీపావళిని అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని, గణపతి బప్పను పూజిస్తారు. ఈసారి అమావాస్య తిథి రెండు రోజులుగా ఉండడంతో దీపావళి విషయంలో చాలా గందరగోళం నెలకొంది. కొంతమంది జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం అక్టోబర్ 31 న దీపావళి జరుపుకోవడం సరైనది. ఎందుకంటే అమావాస్య తిథి రాత్రి అక్టోబర్ 31 న ఉంది. అయితే మరి కొంతమంది జ్యోతిష్య పండితులు పంచాంగం ప్రకారం నవంబర్ 1న దీపావళిని జరుపుకోవాలని సూచించారు.

కాశీలోని పండితులు, హిందూ మత పెద్దలు శంకరాచార్య అవిముక్తేశ్వరమంద్ కూడా దీపావళిని అక్టోబర్ 31 న జరుపుకోవాలని సలహా ఇచ్చారు. ఎందుకంటే అక్టోబర్ 31 రాత్రి అమావాస్య తిథి ఉన్నందున..అయితే నవంబర్ 1 న అమావాస్య తిథి ఉదయం కూడా ఉన్నందున దీపావళి పండుగను ఈరోజు అంటే నవంబర్ 1న జరుపుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఈసారి రెండు రోజుల అమావాస్య తిథి కారణంగా ఐదు రోజుల దీపాల పండుగను ఆరు రోజులుగా మార్చారు.

అమావాస్య అమావాస్య తిథి 2024

ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథి అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3:22 గంటలకు ప్రారంభమై నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. ప్రదోషకాలం నిశిత కాలాల్లో లక్ష్మి దేవి అమావాస్య తిథిలో ప్రయాణిస్తుంది. దీని కారణంగా ప్రదోషకాలం, నిశిత కాలాల్లో లక్ష్మీదేవిని పూజిస్తారు.

ఇవి కూడా చదవండి

పంచాంగం ప్రకారం అక్టోబర్ 31వ తేదీ గురువారం అమావాస్య తిథి.. ప్రదోష కాలం, నిశిత ముహూర్త కాలాలతో పాటు రాత్రి మొత్తం మిగిలిపోయింది. అటువంటి పరిస్థితిలో శాస్త్రాల ప్రకారం, దీపావళి పండుగను జరుపుకోవడం అక్టోబర్ 31 న లక్ష్మీదేవిని ఆరాధించడం అత్యంత ఫలవంతమైనదని చెప్పబడింది. ఎందుకంటే ప్రదోషం నుండి నిశిత కాలం వరకు అమావాస్య తిథి ఉన్నప్పుడే దీపావళి పండుగను జరుపుకోవడం ఉత్తమం.

నవంబర్ 1న మనం దీపావళిని ఎందుకు జరుపుకోవచ్చు?

హిందూ మతంలో చాలా పండుగల తిధులు రెండు రోజులు వచ్చినప్పుడు ఉదయ తిథి ప్రకారం పండగను లెక్కించడం అందరికీ తెలిసిందే. సూర్యోదయ సమయంలో వచ్చే తేదీని ఉదయ తిథి అంటారు. సూర్యోదయం తర్వాత ఒక తిథి 3 ప్రహరాలు ఉంటే దానిని ఉదయ తిథి అంటారు.

దీనతో ఆశ్వయుజ మాసం అమావాస్య తిథి గురించి మాట్లాడినట్లయితే నవంబర్ 1 న సూర్యోదయం తర్వాత 3 ప్రహర వరకు ఉదయ తిథి ఉంటుంది. అంటే నవంబర్ 1 న అమావాస్య తిథిలో ప్రదోషకాలం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో నవంబర్ 1వ తేదీన కూడా లక్ష్మీ పూజ చేయడం మంచిది. నవంబరు 1న దీపావళి జరుపుకోవడం మరింత శుభప్రదమని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొంతమంది పండితుల ప్రకారం చతుర్దశితో కూడిన అమావాస్య కంటే ప్రతిపాదంతో కూడిన అమావాస్య ఉత్తమం. అందుకే దీపావళి నవంబర్ 1 న జరుపుకోవచ్చు.

1 నవంబర్ లక్ష్మీ పూజ ముహూర్తం 2024

  1. నవంబర్ 1న దీపావళి పండుగను జరుపుకోబోయే వారికి లక్ష్మీపూజకు అనువైన సమయం
  2. అమావాస్య తిథి నవంబర్ 1 సాయంత్రం 6:16 వరకు ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 5:36 గంటలకు జరుగుతుంది.
  3. ఈ విధంగా ప్రదోష కాలం.. అమావాస్య తిథి కూడా నవంబర్ 1 న ఉంటుంది.
  4. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5:36 నుంచి 6:16 వరకు లక్ష్మీ దేవిపూజకు అనుకూలమైన సమయం.
  5. అటువంటి పరిస్థితిలో నవంబర్ 1న లక్ష్మీ దేవి పూజకు కేవలం 40 నిమిషాల శుభ సమయం మాత్రమే అందుబాటులో ఉంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Note: పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.