Diwali Celebrations: దీపావళి రోజున దారుణం.. పాదాలకు మొక్కిమరీ తుపాకులతో కాల్పులు! ఇద్దరు మృతి

దీపావళి పండగ రోజు సాయంత్రం కుటుంబం అంతా ఇంటి ముందు టపాసులు కాల్చుతుంటే గుర్తు తెలియని వ్యక్తులు బైకు వచ్చారు. అనంతరం నేరుగా వచ్చి కాళ్లకు మొక్కి.. తమతో తెచ్చుకున్న తుపాకులతో కుటుంబంపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు..

Diwali Celebrations: దీపావళి రోజున దారుణం.. పాదాలకు మొక్కిమరీ తుపాకులతో కాల్పులు! ఇద్దరు మృతి
Man Shot Dead During Diwali Celebrations
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 01, 2024 | 12:26 PM

భోపాల్‌, నవంబర్‌ 1: దీపావళి రోజున దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ఘటన చోటు చేసుకుంది. అందరూ దీపావళి సంబరాల్లో మునిగి ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో మైనర్‌ తీవ్రంగా గాయాల పాలవగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ షాకింగ్‌ ఘటన ఫార్స్‌ బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది.

మృతులను ఆకాశ్‌ (40), అతని మేనల్లుడు రిషబ్ (16)గా గుర్తించారు. మృతుడి కుమారుడు క్రిష్ శర్మ (10) గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. షహదారా ప్రశాంత్‌ గౌతమ్‌ మాట్లాడుతూ.. బిహారీ కాలనీలో రాత్రి సమయంలో బాధితులు ఆకాశ్ శర్మ, అతని మేనల్లుడు రిషబ్ శర్మ, కుమారుడు క్రిష్ శర్మ దీపావళి పటాసులు కాల్చుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చారు. వారు నడుచుకుంటూ వచ్చి ఆకాశ్‌ పాతాలను తాకి, అనంతరం తమ వద్ద ఉన్న తుపాకులతో ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆకాశ్‌, అతడి మేనల్లుడు రిషబ్ అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడు క్రిష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. . ఈ ఘటనలో ఆకాశ్‌ శర్మ పక్కనే ఉన్న రిషబ్‌, క్రిష్‌కు సైతం తూటాలు తగలడంతో.. వారిలో రిషబ్‌ మృతి చెందాడు. అనంతరం వారందరిని ఆసుప్రతికి తరలించగా.. ఆకాశ్‌ శర్మ, రిషబ్‌ చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. క్రిష్‌ శర్మ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

దాడి చేసిన వ్యక్తులు తనకు తెలుసునని ఆకాష్ భార్య చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. వారి మధ్య చాలా ఏళ్లుగా భూమి విషయంలో వివాదం ఉందని ఆమె తెలిపింది. నిందితులు తమ ఇంటిపైనే కాల్పులు జరుపుతారని ఊహించలేదని కన్నీరుమున్నీరైంది. పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీసీపీ షహదారా ప్రశాంత్ గౌతమ్ మీడియాకు తెలిపారు. ఆస్తుల తగాదాల కారణంగానే కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.