Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: పండగొచ్చిందని ఆఫర్‌లో బంగారం కొన్నాడు.. తెల్లారి ఊహించని ట్విస్ట్

పండగొచ్చిందని బంగారాన్ని కొనుగోలు చేసేందుకు గోల్డ్ షాపులకు వెళ్తున్నారా.? అయితే కొంచెం ఆగండి.! ఈ స్టోరీ విన్నారంటే.. దెబ్బకు దడుసుకుంటారు. ఇంతకీ ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా..

Viral: పండగొచ్చిందని ఆఫర్‌లో బంగారం కొన్నాడు.. తెల్లారి ఊహించని ట్విస్ట్
Gold
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 01, 2024 | 12:19 PM

పండుగ వచ్చిందంటే చాలు.. చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయడం వైపే మొగ్గు చూపుతారు. బంగారం షాపు‌ల్లో తెలిసినోళ్లు ఉంటే.. కొందరు పోయి చల్లగా తక్కువ ధరకే గోల్డ్ కొంటుంటారు. ఇంకొందరు టీవీలలో వచ్చే యాడ్స్ చూసి ఫలానా దుకాణంలో ఆఫర్ ఉందని టెంప్ట్ అయ్యి కొనుక్కుంటారు. ఏది ఏమైనా తక్కువ ధరకు బంగారం రావాలి.. కొద్దో.. గొప్పో.. నాలుగైదు రూపాయలు మిగిల్చుకోవాలి. ఇది గోల్డ్ లవర్స్ ప్లాన్.! ఇక ఇట్లా అనుకుని బంగారం షాపులకు వెళ్లే కస్టమర్లు జర జాగ్రత్త.. కొంతమంది బంగారం దుకాణాల మాటున చాటు మాటు యవ్వారం సాగిస్తున్నారు. మరి అదేంటో చూసేద్దామా..

ఇది చదవండి: బాబోయ్.! 5 స్టాప్‌లు, 11 గంటలు.. ఈ వందేభారత్ రైలు రూటే సపరేటు

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని పలు బంగార దుకాణాల పరిస్థితి ఇది. పుదుకొట్టై జిల్లాలో అస్సలు బంగారం పేరిట నకిలి బంగారాన్ని అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ విషయాన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్‌ బయటపెట్టింది. ధన త్రయోదశికి బంగారం కొంటే మంచిదని, చాలామంది తులమో, మాసమో ఇంత బంగారం కొంటుంటారు. అలా మంచిదని బంగారం కొనేందుకు వెళ్లిన కస్టమర్లను నిండా ముంచేస్తున్నారు పుదుకొట్టై జిల్లాలోని పలు బంగారం దుకాణాల్లోని వ్యక్తులు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

916, హాల్ మార్కు బంగారం పేరు మీద దొంగ బంగారాన్ని కస్టమర్లకు అంటగడుతున్నారట. బీఐఎస్‌ సిబ్బంది బంగారం దుకాణాలపై ఆకస్మిక రైడింగ్ చేయడంతో ఈ ముచ్చట కాస్తా బయటపడింది. సుమారు రూ. కోటిన్నర విలువైన బంగారాన్ని పట్టుకుని సీజ్ చేశారు. ఇక ఈ విషయం బయటకు రావడంతో.. ఆయా బంగార దుకాణాల్లో గోల్డ్ కొన్న కస్టమర్లు దెబ్బకు షాక్ అయ్యారు. బంగారం కొనేందుకు వెళ్లే కస్టమర్లు.. కచ్చితంగా BIS మార్క్ చెక్ చేసుకోవాలని సూచించారు.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దేశంలో క్రిప్టో నిబంధనలు..2025లో పెట్టుబడిదారులు తెలుసుకోవలసినవి!
దేశంలో క్రిప్టో నిబంధనలు..2025లో పెట్టుబడిదారులు తెలుసుకోవలసినవి!
అప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు ఐపీఎల్‏లో కోట్లు..
అప్పుడు తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు ఐపీఎల్‏లో కోట్లు..
ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో కీలక నిర్ణయం.. కోట్లాది మందికి ఉపశమనం!
ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో కీలక నిర్ణయం.. కోట్లాది మందికి ఉపశమనం!
అక్కాచెల్లెళ్లతో పెళ్లి.. వరుడి కొంపముంచిన పెళ్లి కార్డు..
అక్కాచెల్లెళ్లతో పెళ్లి.. వరుడి కొంపముంచిన పెళ్లి కార్డు..
మహేశ్వరయ్య అంటే మామూలోడనుకొంటిరా..అంతకు మించి!
మహేశ్వరయ్య అంటే మామూలోడనుకొంటిరా..అంతకు మించి!
వెంటాడుతున్న ట్రంప్‌ సుంకాల భయాలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్స్‌
వెంటాడుతున్న ట్రంప్‌ సుంకాల భయాలు.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్స్‌
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తప్పక తినాల్సిన ఆహారాలు.!
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోవాలంటే తప్పక తినాల్సిన ఆహారాలు.!
తెలుగు కమెడియన్ ఇంట్లో విషాదం..
తెలుగు కమెడియన్ ఇంట్లో విషాదం..
ఈ పండు ప్రత్యేకతలేంటో తెలుసా.?లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఈ పండు ప్రత్యేకతలేంటో తెలుసా.?లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
వైసీపీ అధినేత జగన్‌ సెక్యూరిటీపై రాజుకున్న రచ్చ..
వైసీపీ అధినేత జగన్‌ సెక్యూరిటీపై రాజుకున్న రచ్చ..