King Charles: బ్రిటన్ రాజు-రాణీ ఇండియాకి రహస్యంగా ఎందుకొచ్చారు.? బెంగళూరులో ప్రత్యక్షం.
బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ ఆయన సతీమణి క్వీన్ కెమిల్లా బెంగళూరులో సీక్రెట్‌గా ఓ వెల్‌నెస్ కేంద్రం లో చికిత్స తీసుకున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. బ్రిటన్ రాజదంపతులు సీక్రెట్‌గా ఇండియా ట్రిప్‌కు వచ్చినట్లుగా కథనాలు రాసారు. అక్టోబరు 27 నుంచి వారిద్దరూ బెంగళూరులో ఉన్నట్లు సమాచారం. వెల్‌నెస్ కేంద్రంలో యోగా, మెడిటేషన్ సాధనలో సమయం గడిపినట్లు తెలుస్తోంది.
మీడియా కథనాల ప్రకారం కింగ్ చార్లెస్ ద థర్డ్ దంపతులు అక్టోబర్ 21 నుంచి 26 మధ్య కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరైన తర్వాత సమోవా నుంచి నేరుగా భారత్‌కు రహస్యంగా వచ్చారు. సీక్రెట్ ట్రిప్ కావడంతో ప్రభుత్వం ఎలాంటి అధికారిక ఆహ్వాన కార్యక్రమాలు నిర్వహించలేదు. బెంగళూరులోని వెల్‌నెస్ సెంటర్‌లో ప్రత్యేక సిబ్బంది వారికి వివిధ థెరపీ సెషన్‌లు నిర్వహించారు. కింగ్ ఛార్లెస్ ను బ్రిటన్ రాజుగా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. అయితే ఆయన వేల్స్ యువరాజుగా ఉన్న సమయంలో పలుమార్లు బెంగళూరులోని వెల్‌నెస్ సెంటర్‌కు వచ్చేవారు. తన 71వ పుట్టిన రోజును కూడా ఇక్కడే ఘనంగా జరుపుకున్నారు. 2022లో క్వీన్ ఎలిజబెత్ మరణించిన తర్వాత ఛార్లెస్‌ను బ్రిటన్‌కు రాజుగా ప్రకటించారు.
బ్రిటన్ రాజదంపతులు ప్రస్తుతం చికిత్స పొందుతున్న సౌఖ్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్ బెంగళూరులోని సమేతనహళ్లిలో ఉంది. డాక్టర్ ఇస్సాక్ మథాయ్ డాక్టర్ సుజా ఇస్సాక్ దీనిని స్థాపించారు. ఇందులో ఆయుర్వేదం, నేచురోపతి, ఆక్యుప్రెషర్, యోగా, హోమియోపతి, ఇతర సంప్రదాయ చికిత్సలు చేస్తారు. మూడో ఛార్లెస్ ఈ వెల్‌నెస్ సెంటర్‌కు తొమ్మిదిసార్లు వచ్చి చికిత్స చేయించుకున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.