Watch: డాక్టర్‌ను పెళ్లాడేందుకు రూ. 50 కోట్ల కట్నం డిమాండ్ చేసిన ఎయిమ్స్ టాపర్.?
ఢిల్లీలోని ఎయిమ్స్ టాపర్ ఒకరు డాక్టర్ అయిన తన స్నేహితురాలిని పెళ్లి చేసుకునేందుకు రూ. 50 కోట్ల కట్నం డిమాండ్ చేసినట్టు బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఆరోపిస్తూ ఎక్స్‌లో ఈ విషయాన్ని షేర్ చేసింది. కట్నం డిమాండ్ చేసినప్పటి నుంచి తన స్నేహితురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రోజుల్లో కూడా కట్నం ఎంత మూమూలు విషయంగా ప్రబలిపోయిందో ఈ ఘటన మనకు చెబుతోందని ఆమె విచారం వ్యక్తం చేసింది.
తన స్నేహితురాలిని కట్నం అడిగిన ఆ వ్యక్తి ఎంసీహెచ్ ఇన్ యూరాలజీ కోర్స్‌కు గానూ ఎయిమ్స్ ఎంట్రన్స్ లో టాపర్ అని తెలిపింది. తన స్నేహితురాలు కూడా డాక్టరేనని, హైదరాబాద్‌లో అనిస్థీషియాలో ఎండీతోపాటు లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనిస్థీషియాలో స్పెషలైజేషన్ చేస్తోందని ఆమె వివరించింది. ఎయిమ్స్ ఎంట్రన్స్ ఫస్ట్ ర్యాంకర్.. డాక్టర్ అయిన తన స్నేహితురాలిని రూ. 50 కోట్ల కట్నం అడిగినట్టు చెబుతూ ‘కొంచెమైనా సిగ్గుందా?’ అని ప్రశ్నించారు. డాక్టర్ అయి ఉండీ సొంత కాళ్లపై నిలబడే దమ్ములేని చదువు ఎందుకని దుమ్మెత్తి పోశారు.
రూ. 50 కోట్లంటే ఆమె తల్లిదండ్రుల జీవితకాల సంపాదన అని, ఆ డిమాండ్ వచ్చినప్పటి నుంచి తను విలపిస్తోందని చెప్పారు. తెలుగు అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే పెద్ద మొత్తంలో కట్నం చెల్లించుకోక తప్పదని ఆమె తల్లిదండ్రులు కూడా చెబుతున్నారని పేర్కొన్నారు. ఆమెకు ఓ చెల్లెలు ఉందని, తన స్నేహితురాలికి ఆ మొత్తం కట్నంగా ఇచ్చి పెళ్లి చేస్తే.. ఆమె కూడా అంతే ఇచ్చుకోవాల్సి వస్తుందని వాపోతున్నారట. ఆమె పోస్టుపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. అలాంటి వ్యక్తుల లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!

