Reliance Gift: రిలయన్స్ ఉద్యోగులకు ముకేశ్‌ అంబానీ  దీపావళి గిఫ్ట్ వీడియో వైరల్‌.!

Reliance Gift: రిలయన్స్ ఉద్యోగులకు ముకేశ్‌ అంబానీ దీపావళి గిఫ్ట్ వీడియో వైరల్‌.!

Anil kumar poka

|

Updated on: Nov 04, 2024 | 11:46 AM

దీపావళి అంటే వెలుగుల పండుగ.. ప్రతి ఒక్కరూ ఆనందోత్సహాల నడుమ ఇళ్లు, వాకిళ్లు వెలుగులతో నింపి చేసుకునే సంతోషాల వేడుక. ఈ పండుగకు ప్రత్యేకించి అందరూ ఒకరికొకరు బహుమతులు ఇస్తుంటారు. చాలా కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులు, సిబ్బందికి గిఫ్ట్‌లు, బోనస్‌ వంటివి ఇస్తుంటాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ ఫౌండేషన్ తమ ఉద్యోగులకు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్‌ల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు బహుమతులు ఇస్తాయి. కొన్ని కంపెనీలు బోనస్‌ల రూపంలో నగదు పంపిణీ చేస్తే మరికొన్ని స్వీట్లు, ఇతర గిఫ్ట్‌లు ఇస్తూంటాయి. భారత్‌లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఉద్యోగులకు అదిరిపోయే దీపావళి బహుమతి అందించింది. రిలయన్స్‌ ఇచ్చిన గిఫ్ట్‌బాక్స్‌ తాలూకా అన్‌బాక్స్‌ వీడియో ప్రస్తుతం వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఈ బహుమతి వీడియోను షేర్ చేశారు. గిఫ్ట్‌ బాక్స్‌లో “దీపావళి శుభాకాంక్షలు” “శుభ్ దీపావళి” అని ఇంగ్లీష్, హిందీలో రాసి వుంది. వైట్ బాక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్, అనంత్ అంబానీ, రాధిక మర్చంట్, కుటుంబంలోని మనవళ్లు, మనరాళ్ల తరపున శుభాకాంక్షలతో మెసేజ్‌ కూడా ఉంది. అయితే, మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది.

ఈ గిఫ్ట్ హ్యాంపర్‌లో దృష్టి లోపం ఉన్న కళాకారులు రూపొందించిన మట్టి దీపం, గ్రీటింగ్ కార్డ్, బాదాం ప్యాకెట్, అగరబత్తీలు, చిన్న వెండి గణేశ విగ్రహం, నారతో తయారైన టేబుల్‌క్లాత్ ఉన్నాయి. ఈ వీడియోలను ఉద్యోగులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 1.6 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్‌ రాబట్టింది. 500 కంటే ఎక్కువ మంది వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.