Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main Ranking: జేఈఈ మెయిన్‌ ర్యాంకింగ్‌ విధానంలో కీలక మార్పులు.. ఆ రెండు అంశాలు తొలగించిన NTA

ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు యేటా జేఈఈ మెయిన్స్ పరీక్షను రెండు విడతలుగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు యేటా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్ధులు పోటీ పడుతుంటారు. కానీ కేవలం వందల సంఖ్యలో మాత్రమే అంతిమంగా ర్యాంకులు సాధిస్తారు. ఈ ఏడాది నుంచి ర్యాంకుల నిర్ణయంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి..

JEE Main Ranking: జేఈఈ మెయిన్‌ ర్యాంకింగ్‌ విధానంలో కీలక మార్పులు.. ఆ రెండు అంశాలు తొలగించిన NTA
JEE Main Ranking Pattern
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 03, 2024 | 11:24 AM

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8: దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ ర్యాంకింగ్‌ కొలమానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ పరీక్షలో ఏ ఇద్దరు విద్యార్థులకైనా ఒకే స్కోర్‌ వస్తే.. అలాంటి సందర్భాల్లో ర్యాంకు కేటాయించేందుకు గతంలో తొమ్మిది కొలమానాలు ఉండేవి. అయితే వాటిని తాజాగా ఏడింటికి కుదించారు. అంటే ఈ ఏడు కొలమానాల ద్వారా మాత్రమే అంతిమ స్కోర్‌ని నిర్ణయిస్తారన్నమాట. అప్పుడు ఒకే ర్యాంకు వచ్చిన ఇద్దరికీ వేరువేరు ర్యాంకు కేటాయిస్తారు. ర్యాంకు కొలమానమైన వయసు, హాల్‌టికెట్‌ సంఖ్యను ఈ ఏడాది నుంచి పరిగణనలోకి తీసుకోకుండా తొలగించారు. ఈ మేరకు ఎన్‌టీఏ ర్యాంకింగ్‌ కేటాయింపులో మార్పులు చేసింది.

ఇప్పటివరకు ఏ ఇద్దరికైనా ఒకటే ర్యాంకు వచ్చి టై అయినప్పుడు తొలుత మ్యాథమెటిక్స్‌, ఆ తర్వాత ఫిజిక్స్, అనంతరం కెమిస్ట్రీ స్కోర్‌ను వరుసగా చూసేవారు. అప్పటికీ ఒకే స్కోర్‌ ఉంటే మొత్తం మూడు సబ్జెక్టుల్లో తప్పొప్పుల నిష్పత్తి, ఆ తర్వాత వరుసగా మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో తప్పులు, ఒప్పుల నిష్పత్తిని చూసేవారు. వీటి ద్వారా తక్కువ మైనస్‌ మార్కులున్న వారికి మంచి ర్యాంకు కేటాయించేవారు. అయినా కూడా మార్పులు సమానంగా ఉంటే వయసులో పెద్దవారికి మంచి ర్యాంకు కేటాయించేవారు. చివరగా హాల్‌టికెట్‌ నంబరు అవరోహణ క్రమంలో ఏదీ పెద్దది ఉంటే వారికి మంచి ర్యాంకు ఇచ్చేవారు. అయితే ఈ ఏడాది నుంచి వయసు, హాల్‌టికెట్‌ సంఖ్యను తొలగించి ర్యాంకులు నిర్ణయించనున్నారు. వందకి 100 పర్సంటైల్‌ వచ్చిన వారికి తప్ప మిగిలిన వారికి ఒకే స్కోర్‌ వచ్చే అవకాశం చాలా తక్కువని, చాలా అరుదుగా మాత్రమే ఇలా స్కోర్ టై అయ్యే ఛాన్స్‌ ఉందని చెబుతున్నారు.

కాగా జేఈఈ మెయిన్‌ 2025 తొలి విడత పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 28 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవగా.. నవంబర్‌ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నవంబర్ 22వ తేదీ రాత్రి 11.50 గంటలల్లోగా ఫీజు చెల్లించేందుకు గడువుగా నిర్ణయించారు. పరీక్షకు 3 రోజులు ముందుగా అడ్మిట్‌ కార్డులు విడుదలవుతాయి. జనవరి 22 నుంచి 31వరకు జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్షలు జరుగుతాయి. గత ఏడాది జేఈఈ మెయిన్‌ పరీక్షలు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది రాశారు. ఈ సారి కూడా పోటీ తీవ్రస్థాయిలో ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఈ సుకుమారి స్పర్శతో ఆ చీర పునీతం అయింది.. మెస్మరైజ్ అనన్య..
ఈ సుకుమారి స్పర్శతో ఆ చీర పునీతం అయింది.. మెస్మరైజ్ అనన్య..
43 బంతుల్లో 0 పరుగులు 4 వికెట్లు.. దుమ్ములేపిన కోహ్లీ దోస్త్
43 బంతుల్లో 0 పరుగులు 4 వికెట్లు.. దుమ్ములేపిన కోహ్లీ దోస్త్
రూల్స్‌ మరింత కఠినం.. ఈ డీలర్లు సిమ్ కార్డులను విక్రయించలేరు!
రూల్స్‌ మరింత కఠినం.. ఈ డీలర్లు సిమ్ కార్డులను విక్రయించలేరు!
AI ఫీచర్లతో కూడిన సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. రూ.30 వేల లోపే..
AI ఫీచర్లతో కూడిన సూపర్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. రూ.30 వేల లోపే..
యష్ సినిమా ఆ విషయంలో ఫస్ట్ ప్రాజెక్ట్..
యష్ సినిమా ఆ విషయంలో ఫస్ట్ ప్రాజెక్ట్..
15 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ.. క్రికెట్ గాడ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్
15 ఏళ్ల తర్వాత డబుల్ సెంచరీ.. క్రికెట్ గాడ్‌కు స్పెషల్ సర్‌ప్రైజ్
పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ.. చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం
వారికి శని దోషం..ఈ పరిహారాలతో శనీశ్వరుడు శాంతించే అవకాశం..!
వారికి శని దోషం..ఈ పరిహారాలతో శనీశ్వరుడు శాంతించే అవకాశం..!
మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..?
మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది..?
సోలో ట్రిప్ సజావుగా.. ఆడవారు మీ ప్రయాణాన్ని ఇలా ప్లాన్ చేస్కోండి
సోలో ట్రిప్ సజావుగా.. ఆడవారు మీ ప్రయాణాన్ని ఇలా ప్లాన్ చేస్కోండి