TGPSC Group 3 Hall Tickets: మరో వారంలో టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్ష హాల్‌ టికెట్లు.. పరీక్ష తేదీలివే

టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షల హాల్ టికెట్లు వచ్చే వారంలో జారీ చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఇప్పటికే ఈ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసిన TGPSC పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలో దాదాపు 5 లక్షలకు పైగా అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు..

TGPSC Group 3 Hall Tickets: మరో వారంలో టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 పరీక్ష హాల్‌ టికెట్లు.. పరీక్ష తేదీలివే
TGPSC Group 3
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 04, 2024 | 9:01 AM

హైదరాబాద్‌, నవంబర్‌ 4: తెలంగాణలో గ్రూప్‌ 3 అభ్యర్థులకు నవంబర్‌ 17, 18 తేదీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) ఏర్పిగ్తు చేస్తుంది. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్‌ 17 తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక నవంబర్‌ 18న పేపర్‌ 3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌ టికెట్లను నవంబర్‌ 10 నుంచి వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

కాగా తెలంగాణ గ్రూప్‌ 3 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా 5.36 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 1380కి పైగా గ్రూప్‌ 3 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. మొదటి సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు తేల్చి చెప్పారు. గ్రూప్‌ 3 సెలక్షన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను, క్వశ్చన్‌పేపర్లను జాగ్రత్త దాచుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు మరో ఛాన్స్‌

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ (జీడీ) పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లను మార్చుకోడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు కానిస్టేబుల్‌ నియామక పరీక్ష దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్‌ను నవంబర్‌ 5వ తేదీన అందుబాటులోకి తీసుకురానుంది. నవంబర్‌ 7వ తేదీ వరకు ఎడిట్‌ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. కాగా ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్‌ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ రాత పరీక్ష వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. ఈ పరీక్షను ఇంగ్లిష్‌, హిందీతోపాటు తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే