ఈ సోడా బుడ్డి కళ్లద్దాల చిన్నోడిని గుర్తుపట్టారా.? తెలుగులో హ్యాట్రిక్ హిట్స్.. అమ్మాయిల డ్రీమ్ బాయ్

పైన పేర్కొన్న చిన్నోడు తెలుగులో క్రేజీ హీరో.. చేసిన మూడు సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించాయి. ఇక సొంత భాషలో అయితే బోలెడన్ని సినిమాల్లో నటించాడు. ఎవరో గుర్తుపట్టారా..

ఈ సోడా బుడ్డి కళ్లద్దాల చిన్నోడిని గుర్తుపట్టారా.? తెలుగులో హ్యాట్రిక్ హిట్స్.. అమ్మాయిల డ్రీమ్ బాయ్
Tollywood
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 03, 2024 | 8:34 AM

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.? చిరునవ్వులు నవ్వుతోన్న ఈ చిన్నోడు తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ సాధించాడు. ఓ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరొందిన అతడు.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి వరుస హిట్స్ కొట్టాడు. అలాగే అమ్మాయిలలోనూ మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇంతకీ అతడెవరో కాదు.. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.

‘మహానటి’ సినిమాతో తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించిన దుల్కర్.. ఆ తర్వాత ‘సీతారామం’ సినిమాతో అమ్మాయిలకు కలల రాకుమారుడిగా మారాడు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక లేటెస్ట్‌గా ప్రభాస్ నటించిన ‘కల్కి’లో ఓ చిన్న రోల్ చేసిన దుల్కర్.. తన ఇంపాక్ట్‌ను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. తెలుగులో వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టాడు.

ఇవి కూడా చదవండి

తండ్రి మమ్ముట్టి మలయాళంలో స్టార్ హీరో కావడంతో దుల్కర్ సల్మాన్ సినీ ఇండస్ట్రీలోకి సులభంగానే వచ్చాడు. కానీ ఇప్పుడున్న పొజిషన్‌కు చేరడానికి చాలా కష్టపడ్డాడు. వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్‌గా మారిన దుల్కర్.. సొంత భాష మలయాళంలో బోలెడన్ని హిట్ చిత్రాల్లో నటించాడు. తెలుగులోనూ మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్‌తో బ్లాక్‌బస్టర్స్.. అలాగే హిందీ, తమిళంలోనూ హీరోగా హిట్స్ సాధించాడు. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. దుల్కర్ ఆయనను మించి మరీ దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రశంసలు అందుకున్నాడు.

View this post on Instagram

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి