AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తండ్రి స్టార్ డైరెక్టర్.. భార్య క్రేజీ హీరోయిన్..ఈ పాన్ ఇండియా హీరోను గుర్తు పట్టారా?

పై ఫొటోలో తల్లితో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు పాన్ ఇండియా యాక్టర్. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజి బిజీగా ఉంటున్నాడు.

Tollywood: తండ్రి స్టార్ డైరెక్టర్.. భార్య క్రేజీ హీరోయిన్..ఈ పాన్ ఇండియా హీరోను గుర్తు పట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: Nov 03, 2024 | 8:13 AM

Share

ఇటీవల సెలబ్రిటీల చిన్న నాటి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా తమ అభిమాన హీరోలు చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం నెట్టింట త్రో బ్యాక్ ట్రెండ్ అవుతోంది. అలా ఇప్పుడు దక్షిణాది సినీ అభిమానులకు ఇష్టమైన నటుడి చిన్ననాటి ఫొటో ఒకటి నెట్టింట బాగా వైరలవుతోంది. ఈ యాక్టర్ మలయాళీనే అయినా తెలుగు, తమిళ్ భాషల్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ నటుడికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఒక వైపు హీరోగా చేస్తూనే, మరోవైపు విలన్ గానూ మెప్పిస్తున్నాడు. అలాగే పాత్ర నచ్చితే స్టార్ హీరోల సినిమాల్లో సహాయక పాత్రలు సైతం పోషిస్తున్నాడు. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోన్న ఈ హీరోను గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ. ఇతని భార్య కూడా స్టార్ హీరోయిన్. గతేడాది న్యాచురల్ స్టార్ నానితో కలిసి ఓ తెలుగు సినిమా కూడా చేసింది. ఈ బ్యూటీ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ పాటికే చాలామందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. అతను మరెవరో కాదు పుష్ప 2 ఫేమ్ ఫహాద్ ఫాజిల్.

ఇవి కూడా చదవండి

ప్రముఖ దర్శకుడు బాసిల్ తనయుడిగా సినిమా ఇండస్ట్రలోకి అడుగు పెట్టాడు ఫాహద్ ఫాజిల్. అయితే తన తొలి సినిమానే ప్లాఫ్ అయ్యింది. దీంతో ఏకంగా ఏడేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాడు. అయితే గోడకు కొట్టిన బంతిలా గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుని స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సూపర్ డీలక్స్, విక్రమ్, మామన్నన్ , వేట్టయాన్, తెలుగులో పుష్ఫ, ఆవేశం.. ఇలా పలు సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక పుష్పలో ఫాహద్ ఫాజిల్ పోషించిన భన్వర్ సింగ్ షెకావత్ పాత్రకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా నటుడి చేతిలో పుష్ఫ 2తో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

భార్య నజ్రియాతో ఫాహద్ ఫాజిల్..

View this post on Instagram

A post shared by Nazriya Nazim (@iam_nazriya)

ఫాహద్ ఫాజిల్, నజ్రియాల రొమాంటిక్ ఫొటో..

View this post on Instagram

A post shared by Nazriya Nazim (@iam_nazriya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..