- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Telugu Fame Bhanu Shree Visits Triyugi Narayan Temple, See Photos
Bhanu Shree: త్రియుగి నారాయణ్ ఆలయంలో బిగ్ బాస్ బ్యూటీ .. ఎందుకు దర్శించుకుంటారో తెలుసా?
టాలీవుడ్ ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ ఆధ్యాత్మిక యాత్ర బాట పట్టింది. చార్‌దామ్‌మార్గంలో ఉన్న ప్రముఖ ఆలయాలను దర్శించుకుంది. కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసి మొక్కులు తీర్చుకుంది.
Updated on: Nov 03, 2024 | 7:30 AM

టీవీషోస్ తో బిజీ బిజీగా ఉంటే భానుశ్రీ ఆధ్యాత్మిక యాత్ర బాట పట్టింది. చార్‌దామ్‌మార్గంలో ఉన్న ప్రముఖ ఆలయాలు, పుణ్య క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేసింది.

ఇందులో శివపార్వతుల కళ్యాణ వేదిక త్రియుగినారాయణ దేవాలయాన్ని దర్శించుకుందీ అందాల తార. ఈ దేవాలయం ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది.

సముద్ర మట్టానికి 1,980 మీటర్లు (6,500 అడుగులు) ఎత్తులో ఉండే త్రియుగినారాయణ దేవాలయాన్ని పెళ్లికాని వారు తొందరగా పెళ్లికావాలని సందర్శించుకుంటారట.

అంతకు ముందు కేదార్ నాథ్, బద్రీనాథ్ తదితర ప్రముఖ ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించింది భానుశ్రీ.

తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది భాను శ్రీ. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి

కాగా గతంలో కొన్నిసినిమాల్లో సహాయక నటిగా నటించింది భానుశ్రీ. అలాగే పలు టీవీ షోలకు యాంకర్ గా కూడా వ్యవహరించింది. ఇక సోషల్ మీడియాలోనూ భాను శ్రీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.




