AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: మార్చురీ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా.. బాబోయ్..

డాక్టర్లు అప్పుడప్పుడూ అరుదైన సంఘటనలను చూస్తుంటారు. సరిగ్గా ఉత్తరప్రదేశ్‌లోని వైద్యులకు కూడా ఇదే జరిగింది. మార్చురీలో శవానికి పంచనామా చేస్తోన్నప్పుడు..

Viral: మార్చురీ నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని చూడగా.. బాబోయ్..
MortuaryImage Credit source: Getty Images
Ravi Kiran
|

Updated on: Nov 02, 2024 | 12:55 PM

Share

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చనిపోయాడని నిర్ధారించుకొన్న వైద్యులు శవపరీక్షకు సిద్ధమయ్యారు. పంచనామా చేసేందుకు డెడ్‌బాడీని స్ట్రెచరుపై మార్చురీకి తరలిస్తుండగా ఆ యువకుడిలో ఒక్కసారిగా చలనం వచ్చింది. తాను బతికే ఉన్నట్లు కేక వేయడంతో ఒక్కసారిగా అందరూ ఖంగుతిన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌ వైద్య కళాశాలలో ఈ ఘటన జరిగింది.

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

మీరట్ జిల్లా గోట్కా గ్రామానికి చెందిన షగుణ్‌శర్మ తన సోదరుడితో కలిసి బుధవారం రాత్రి బైకుపై ఖతౌలీ వైపు వెళుతుండగా.. వేగంగా వచ్చిన మరో వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. సోదరులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. షగుణ్‌శర్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మీరట్ వైద్య కళాశాలకు తరలించారు. అక్కడి వైద్యులు షగుణ్‌కు చికిత్స అందించాక.. చనిపోయినట్లు ప్రకటించారు. మార్చురీకి తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పంచనామా చేస్తున్న దశలో షగుణ్‌లో కదలిక వచ్చి ‘‘సార్‌! నేను బతికే ఉన్నా’’ అని వైద్యుడితో చెప్పాడు. అవాక్కైన వైద్యులు షగుణ్‌ను మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఈ ఘటనపై మేరఠ్‌ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ విచారణకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: బాబోయ్.! 5 స్టాప్‌లు, 11 గంటలు.. ఈ వందేభారత్ రైలు రూటే సపరేటు

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..