AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ చిన్నారి స్టార్ డైరెక్టర్ కూతురు.. సింగర్ కమ్ హీరోయిన్.. ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయ్యింది..

సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు కొన్ని నెలలుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ చిన్నారి ఇండస్ట్రీలో ఓ టాప్ డైరెక్టర్ గారాలపట్టి. సినీరంగంలోని స్టార్ హీరోల సరసన నటించి ప్రశంసలు అందుకుంది. అంతేకాదు.. డాక్టర్ చదివి ఓవైపు వైద్య సేవలు అందిస్తూనే మరోవైపు సినిమాల్లో హీరోయిన్‌గా దూసుకుపోతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా?

Tollywood: ఈ చిన్నారి స్టార్ డైరెక్టర్ కూతురు.. సింగర్ కమ్ హీరోయిన్.. ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయ్యింది..
Actress New
Rajitha Chanti
|

Updated on: Nov 05, 2024 | 6:56 PM

Share

ఇటీవల సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ టాప్ సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోస్ చూసేందుకు.. వారి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నరాు. ఈ క్రమంలోనే తాజాగా ఓ చిన్నారి ఫోటో స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. పైన ఫోటోను చూశారు కదా. అందులో కనిపిస్తున్న ఆ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్. అంతేకాదు అమె సింగర్ కూడా. సినిమాల్లోకి రాకముందు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలు అందిస్తుంది. అలాగే హీరోయిన్ గా సినీరంగంలో సత్తా చాటుతుంది. ఇక ఆమె తండ్రి ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ అదితి శంకర్. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు.

హీరోయిన్ అదితి శంకర్ 6 జూలై 1997న చెన్నైలో జన్మించింది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.శంకర్ కుమార్తె. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఆసక్తి ఉన్నా తండ్రి కోరిక మేరకు మెడిసిన్ పూర్తి చేసింది. 2022లో ముత్తయ్య దర్శకత్వం వహించిన “విరుమాన్” చిత్రంలో నటుడు కార్తీ సరసన కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. అంతేకాదు ఇదే సినిమాలో “మధుర వీరన్” అనే సాంగ్ పాడి సింగర్ గానూ అదరగొట్టేసింది. నటిగానే కాకుండా ప్రముఖ నేపథ్య గాయని కూడా. 2022లో తెలుగు చిత్రం ‘ఘని’లో “రోమియో అండ్ జూలియట్” పాట పాడటం ద్వారా గాయనిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత మావీరన్ చిత్రంలో.. అనేక స్టేజ్ షోలలో సాంగ్స్ పాడి ఆకట్టుకుంది.

నటిగా మెప్పిస్తూనే.. మరోవైపు విమర్శలను సైతం స్వీకరిస్తుంది అదితి. ప్రస్తుతం అదితి నటుడు మురళి తనయుడు ఆకాష్ మురళితో కలిసి విష్ణువర్ధన్ దర్శకత్వంలో “నేసిపాయ” చిత్రంలో నటిస్తోంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్నది. దీని తర్వాత నటుడు అర్జున్ దాస్‌తో కలిసి “వన్స్ మోర్” చిత్రంలో కనిపించనుంది. అలాగే అదితి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూస్తుంది.

ఇది చదవండి : Tollywood : అదృష్టం కలిసిరాని అందాల రాశి.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టగలరా.. ?

Dandupalyam Movie: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. దండుపాళ్యం హీరోయిన్‏ను చూస్తే షాకవ్వాల్సిందే..

Tollywood: నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదు.. ఎన్నో ఇబ్బందులు పడిన హీరోయిన్.. చివరకు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us