Megastar Chiranjeevi: భారత్ – పాకిస్తాన్ మ్యాచ్.. స్టేడియంలో చిరంజీవి, నారా లోకేశ్, సుకుమార్ సందడి..
క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. క్రికెట్ అభిమానులే కాకుండా.. సినీ ప్రముఖులు, సామాన్యులు సైతం ఆసక్తిగా వీక్షిస్తున్నారు. అయితే పలువురు స్టార్స్ ఇప్పుడు దుబాయ్ క్రికెట్ స్టేడియంలో సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ తెగ వైరలవుతున్నాయి.

ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులే కాదు, సెలబ్రిటీలు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ లిస్ట్‌లో మన టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా చేరిపోయారు. ప్రత్యక్షంగా చూసేందుకు ఏకంగా దుబాయ్ చేరుకుని, సందడి చేస్తున్నారు. భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను మెగాస్టార్ చిరంజీవి పెవిలియన్‌లో కూర్చుని భారత క్రికెటర్లు తిలక్ వర్మ, అభిషేక్‌లతో కలిసి మ్యాచ్ చూశారు. అలాగే ఏపీ మంత్రి నారా లోకేశ్, డైరెక్టర్ సుకుమార్ సైతం స్టేడియంలో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించారు. ఇందుకు సంబందించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అలాగే భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, నటుడు సన్నీడియోల్ కలిసి టీవీలో మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోస్ సైతం చక్కర్లు కొడుతున్నాయి.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 241 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే ఛాంపియన్స్ ట్రోఫి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లకు ఇది రెండవ మ్యాచ్. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు విజయం సాధిస్తే సెమీఫైనల్లో తమ స్థానాన్ని ఖాయం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు పాకిస్తాన్ తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిపోయింది.
దుబాయ్ లో జరుగున్న భారత్ , పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు టాలీవుడ్, బాలీవుడ్ సినీలోకం కదిలింది. నటి సోనమ్ కపూర్ కూడా హాజరయ్యారు.
#Chiranjeevi ❤️🔥 pic.twitter.com/N2tnQi2SK4
— RC_Addict 🐎 (@Charan_Admirer) February 23, 2025
The Action Superstar @iamsunnydeol and @msdhoni from the special shoot for the #INDvsPAK match today 🔥#JaatKeSaathSaat#JAAT GRAND RELEASE WORLDWIDE ON APRIL 10th.#BaisakhiWithJaat pic.twitter.com/SZPSaKyAOT
— Suresh PRO (@SureshPRO_) February 23, 2025
Come on India! Wishing our team all the best!#INDvsPAK#ICCChampionsTrophy pic.twitter.com/u0wTBYdSuR
— Lokesh Nara (@naralokesh) February 23, 2025
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన